
- నర్సాపూర్ ఎమ్మెల్యే మనసున్న మారాజు
మెదక్ జిల్లా, ప్రతినిధి, ఎర్ర. పురుషోత్తం (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 7
కొల్చారం గ్రామాన్ని నందన వనంగా తీర్చిదిద్దునాని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు.కొల్చారం గ్రామంలో ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా చేపట్టినా సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మదన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొల్చారం గ్రామనికి సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషి తో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా 55 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక సర్పంచ్ ఉమ రాజా గౌడ్ తో కలిసి సీసీ రోడ్డు పనులను లాంఛనంగా ప్రారంభించారు. అంతరం ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలని గుతేదర్ మన్నే శ్రీనివాస్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ సావిత్రి రెడ్డ్, ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్,జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, దేవెన్నగారి శేఖర్,ప్రభాకర్, జూలకంటి సంగమేశ్వర్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.






