
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక ,ఫిబ్రవరి 7.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా పినపాక మండల కేంద్రంలో తోగ్గూడెం ఎంపీటీసీ చింతపంంటి సత్యం ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాన్ని పినపాక గ్రామంలో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ హయాంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారని సంక్షేమ పథకాల విషయంలో మన రాష్ట్రం అమలుపరుస్తుంటే వివిధ రాష్ట్రాలు మనల్ని అనుసరిస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో టిఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందని కుటుంబం అంటూ లేదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు.రాబోయే ఎన్నికల్లో సైతం విప్ రేగా కాంతారావు మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం తద్యమన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్, స్వతంత్ర రెడ్డి ,స్థానిక యువకులు పాల్గొన్నారు.





