
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 7.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, గడ్డంపల్లి గ్రామం చెందిన కదురు కౌసల్య(70) కొన్నిరోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించింది. కడు పేదరికం తో జీవనం కొనసాగిస్తున్న ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకున్న పినపాక ఎం పి పి గుమ్మడి గాంధీ వారి కుటుంసభ్యుల ను కలిసి పరామర్శించారు.
కౌసల్య దశ దిన కర్మలకు ఆర్థిక సహాయంగా 50కేజీ ల బియ్యం, నగదును ఇచ్చారు .
ఈ కార్యక్రమంలో పంచాయితి సర్పంచ్ సునీల్ కుమార్ , ఉప సర్పంచ్ ఇల్లెందుల లక్ష్మి నారాయణ, పంచాయితి గుమాస్తా కలివేటి సుమన్ వార్డు మెంబర్లు ఎడ్ల సారమ్మ, కలం సూర్యనారాయణ,పడిగ అశోక్ కుమార్, పడిగా సమ్మయ్య, మల్లెల గౌరయ్య, రేగ బిక్షం, సోలం నాగేంద్ర, పాయం నవేందర్, బండారి సుధాకర్, సొలం సురేష్,కలివేటి జయ, సూర్య, పవన్, క్రాంతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు .





