
జనసముద్రం న్యూస్:(ఫిబ్రవరి 07)
హుజురాబాద్ టౌన్.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తేది 17. 02. 2023 నుండి తేది 19 వరకు హుజురాబాద్ నుండి వేములవాడకు ప్రతిరోజూ 15 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు హుజురాబాద్ డిపో మేనేజర్ శ్రీమతి పి.అర్పిత తెలిపారు.30 మంది ప్రయాణికులు ఉన్నట్లయితే వారు కోరిన దగ్గరకు బస్సు పంపిస్తున్నట్లు డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.అలాగే హుజురాబాద్ నుండి కాళేశ్వరం మరియు హుస్నాబాద్ మీదుగా పొట్లపల్లిలోని స్వయంభూరాజేశ్వరాలయం వరకు కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు.





