
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 7
తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో యాదవుల కులస్తుల ఆధ్వర్యంలో జరుగుతున్న జాతర ఉత్సవాలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో గత 20 సంవత్సరాల నుండి ఎంతో ఘనంగా యాదవ కులస్తులు నిర్వహిస్తున్నారు, శ్రీ మల్లికార్జున స్వామి ఎంతో విశిష్టత గొప్పగా కొలుచుకుని మల్లికార్జున స్వామి యాదవుల ఆరాధ్య దైవంగా కొలుస్తారు, ఈ జాతర ఉత్సవాలలో మల్లికార్జున స్వామి పెళ్లి వేడుకలు, అగ్నిగుండాలు, బోనాలు, లను చూడటానికి తూప్రాన్ మండలంలోని చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు ఈ జాతరను ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహిస్తుoటమని యాదవ కులస్తులు పెద్ద గొల్ల నక్కలపల్లి బాలేష్, యాదవ కులస్తులు తెలిపారు, ఈ కార్యక్రమంలో యాదవ కులస్తులు, గ్రామ సర్పంచ్ లంబ వెంకటమ్మ, పెద్ద గొల్ల నక్కలపల్లి బాలేష్, నాయకులు లంబ రమేష్, తుంట నరసింహులు, యాదవ కులస్తులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






