
*నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి…
మెదక్ జిల్లా, ప్రతినిధి, ఎర్ర. పురుషోత్తం (జన సముద్రం న్యూస్ )ఫిబ్రవరి: 7
మెదక్ జిల్లా కొల్చారం మండలం పరిషత్ కార్యాలయంలో షాద్ ముబారక్ కళ్యాణ్ చేపలకు పంపించడానికి వచ్చిన నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎనిమిది గ్రామాల లబ్ధిదారులకు 22 చెక్కులను నర్సాపూర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో కొల్చారం మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ వంటి పథకాలు నిరుపేద కుటుంబాలకు ఎంతో సహాయం చేస్తున్నాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్ మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే కష్టాలో ఉన్న నిరుపేదలకు మేన మామ లాగా ఆదుకుంటున్న కేసీఆర్ కు నిరుపేద కుటుంబాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ మార్కెట్ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, చైర్మన్ చంద్ర గౌడ్, కొల్చారం ఎంపీడీవో గణేష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





