
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 6.
పినపాక మండలంలో ఎంతమంది రైతులకు పట్టాలు మంజూరయ్యాయో, మంజూరు కానీ రైతులు ఎంతమంది ఉన్నారన్న సమాచారం అందించాలని పినపాక మండల కేంద్రంలోని తాసిల్దార్ ను కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని సూపర్డెంట్ రమేష్ కు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఎంతో మంది రైతులు రుణమాఫీ గాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, చాలామంది దొంగ పట్టాలు సృష్టించి బ్యాంకులో రుణాలు తీసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమంగా రైతు రుణాలు పొందిన వారిని గుర్తిస్తామన్నారు. సన్న, చిన్న కారు రైతులు బ్యాంకులో రుణాలకు వడ్డీలు పెరిగిపోయాయని, కొత్త రుణాలు ఇవ్వక రైతుల తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.





