ఘనంగా ఆవ్యుక్త ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

Spread the love

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 06)

శేరిలింగంపల్లి లో గల అవ్యుక్త” ఇంటర్నేషనల్ స్కూల్ 8వ వార్షికోత్సవ వేడుకలు బి హెచ్ ఈ ఎల్ లోని ఇంటర్నేషనల్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాని ప్రారంభించారు. వారితోపాటు శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ ప్రణయ్ కుమార్, చంద్రయ్య తదితరులు హాజరయ్యారు. వార్షికోత్సవానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ, చైర్మన్ కేశవ శ్రీరామ్ అధ్యక్షత వహించగా, ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా ఎంఎస్ దినేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే ఉత్తమమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషిచేయాలన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదివే పిల్లలు తబలా, పియానో వాయిస్తూ, కరాటే మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తూ అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లితండ్రులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్