తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఎందుకు మంజూరు చెయ్యరు..?: జూలకంటి రంగారెడ్డి..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 4:

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన శనివారం ధర్నా నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని సుందరయ్య పార్క్ నుండి రాజీవ్ చౌక్ రహదారి మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరిగిన అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆర్డిఓ చెన్నయ్య కు జూలకంటి రంగారెడ్డి, ప్రజా సంఘాల ఐక్యవేదిక, తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు.

సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరిచి పేదలకు న్యాయం చేయాలని జూలకంటి రంగన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజమైన అర్హులకు ఇంటి స్థలం తో పాటు,స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని కోరారు. అరులైన పేదలందరికీ రేషన్ కార్డులు,పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరిచి పేదలకు న్యాయం చేయాలని ,సంపద సృష్టించే కార్మికులు, పేదల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా వ్యవహరించాలని జూలకంటి కోరారు.
ఈ కార్యక్రమంలో జూలకంటి రంగన్న తో పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి,వినోద్ నాయక్, చేతివృత్తుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు, కెవిపిఎస్ రాష్ట్ర రేమిడాల పరశురాములు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా నాయకులు సైదా నాయక్, జగన్ నాయక్, బాబునాయిక్, పాపి రెడ్డి, లక్ష్మీనారాయణ, వదూద్, సమద్ , సిపిఎం పార్టీ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి