ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయండి: ఎస్ఎఫ్ఐ..

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 4:

ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ పిలుపుమేరకు

జిల్లాస్థాయి ఎస్ఎఫ్ఐ మోడల్ 10 క్లాస్ టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయాలని, టాలెంట్ టెస్ట్ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదానాయక్ మాట్లాడుతూ..
ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ను ఈ నెల 12వ తారీకు నాడు మిర్యాలగూడ పట్టణంలోని బక్కల్ వాడ హైస్కూల్లో నిర్వహిస్తున్నామని,ఈ టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాన్ని ప్రముఖ విద్యావేత్త మాజీ శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ చుక్క రామయ్య ఆధ్వర్యంలో ప్రశ్న పత్రాన్ని తయారు చేస్తారన్నారు. ఎస్ఎఫ్ఐ ఉద్యమాలకే పరిమితం కాకుండా విద్యార్థులో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని, విద్యార్థుల ఆలోచనతో ఈ టాలెంట్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు అన్నారు. విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ పరీక్ష రాయడం వలన విద్యార్థులలో ఈ “టాలెంట్ టెస్ట్” తన మనసులోని భయాన్ని పోగొట్టి ఫైనల్ ఎగ్జామ్స్ లో సమయపాలన అర్థమయ్యే విధంగా ఈ పరీక్షలు ఉపయోగపడతాయని కుర్ర సైదా నాయక్ తెలిపారు. విద్యార్థులు ఎంతవరకు చదువుకున్నారు.. ఎంతవరకు చదువుకోవాలనే అవగాహనకు విద్యార్థులు ఆలోచిస్తారన్నారు.విద్యార్థులు తద్వారా ఫైనల్ ఎగ్జామ్ లో మంచి “ఉత్తీర్ణతతో కూడిన మార్కులు” వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని కుర్ర సైదా నాయక్ కోరారు. విద్యార్థులు పరీక్షల హాల్ టికెట్ల కొరకు.. 773000 5726, 9 1 8 2 8 6 5288, 8125345434 నంబర్లను సంప్రదించగలరని కుర్ర సైదా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సైదా నాయక్ తో పాటు బక్కలవాడ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ టౌన్ కార్యదర్శి జగన్ నాయక్, ఉపాధ్యాయులు.. రాజు, వెంకట్ రెడ్డి, మధు, చిన్నమయ్య శ్రీనివాసరావు, రహీం,వెంకటేశ్వర్లు,నాగరాజు.. లు,ఎస్ఎఫ్ఐ నాయకులు.. మనోహర్, సమ్మధ్, సూర్య, ఉపేందర్, అఖిల్, ఈశ్వర్, అఖిల్, భవాని,మౌనిక, మంజుల.. లు, ఎస్ఎఫ్ఐ డివిజన్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి