
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్ ,కరకగూడెం, ఫిబ్రవరి 4.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కష్ట,సుఖాలను తెలుసుకోవడం కోసం, ప్రియతమ నాయకుడు టీపీసీసి అధ్యక్షులు తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి, బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ చేసినటువంటి భారత్ జోడో యాత్ర కు మద్దతుగా,ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను,మళ్ళీ అధికారంలోకి వస్తే చేయబోయే పనులను వివరిస్తూ ఈ నెల 6వ తేదీన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతల నుండి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను మొదలుపెట్టడం జరుగుతుందన్నారు.
కావున కాంగ్రెస్ పార్టీ గ్రామ,మండల నాయకులు, కార్యకర్తలు,సీనియర్ నాయకులు,యువజన నాయకులు,అభిమానులు, ప్రజాప్రతినిధులు,అనుబంధ సంఘాల వారు,రైతులు పెద్ద ఎత్తున హాజరై పాదయాత్ర ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అరాచక,నియంత పాలన పోయి ప్రజా పాలన,రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని కాని ముఖ్యమంత్రి కెసిఆర్ నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కెసిఆర్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మిట్టపల్లి నితిన్ , మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్ ,మండల మహిళా నాయకురాలు చందా వెంకట రత్నమ్మ , మండల కార్యదర్శి షేక్ రఫీ , మండల నాయకులు బైరిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు.





