
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, ఫిబ్రవరి 4.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, మల్లారం గ్రామంలో పెద్దోజు శ్రీనివాస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాథం 50 కేజీల బియ్యం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసు పేదరికంలో ఉండటం వలన ఆయన కూతురు దుర్గాభవాని వివాహం ఈనెల 11వ తేదీన జరుగుతుందని ఈ వివాహానికి కనీసం 250 మందికి భోజన సదుపాయం కల్పించలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ తరఫున 50 కేల బియ్యాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాడి రాంబాబు, కె. వెంకటేశ్వర్లు ,యాలం బుజ్జిబాబు, చంటి ,సుభాష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.





