సీఎంఆర్ఎఫ్ నిధితో పేదలకు భరోసా: ఎంపీపీ గుమ్మడి గాంధీ

Spread the love

జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక ఫిబ్రవరి 4.

.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. సీతంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని దీనిలో భాగంగానే సీఎంఆర్ఎఫ్ నిధిని బాధిత ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు . అలాగే పార్టీ నాయకులు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని, గ్రామస్థాయిలో ఉన్న వివిధ సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రానున్న వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో మంచినీటి సరఫరా , మిషన్ భగీరథ నీటి సరఫరా విషయంలో ఏమైనా మరమ్మత్తులు ఉంటే సత్వరమే జరిపించాలని పంచాయతీ ల సర్పంచులను, కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ,ఉప్పాక సర్పంచులు పోతినేని శివ శంకర్, సుజాత, ఉప సర్పంచ్ కొండేరు నాగభూషణం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార నరసింహారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి