
డి.ఎస్ చౌహన్,ఐపీఎస్
సర్ప్రైజ్ విజిట్స్ చేస్తున్న సీపీ
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 04
క్షేత్రస్థాయిలో సామాన్య ఫిర్యాదు దారుల సమస్యలను తెలుసుకునేందుకు రాచకొండ సి.పి డిఎస్ చౌహన్,ఐపీఎస్., స్వయంగా రంగంలోకి దిగారు.
రాచకొండ సీ.పీగా బాధ్యతలు చేపట్టిన సీపీ., గత కొన్ని రోజులుగా వివిధ పొలిష్టేషన్ లల్లో ఆకస్మికంగా విజిట్ చేస్తున్నారు.
అందులో భాగంగా ఘట్‌కేసర్, కీసర పోలీస్ స్టేషన్ లను సందర్శించిన సీపీ. పోలీస్ స్టేషన్ లలోని రిసెప్షనిస్ట్ ఉమెన్ పీసీలతో ఫిర్యాదుదారుడిగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
అనంతరం ఫిర్యాదుదారులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే సీ.పీ ప్రశ్నలను వేసి అడిగి తెలుసుకున్నారు.
ఫిర్యాదుదారుల ఫిర్యాదులను గౌరవంగా స్వీకరించాలని, వారితో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. మరియు ఫిర్యాదు దారులు ఇచ్చిన (అతని/ఆమె) ఫిర్యాదుపై తీసుకున్న చర్యల గురించి వారు అప్‌డేట్ చేయాలనీ సీ.పీ సూచించారు.





