విద్యార్థుల పట్ల తమ మంచి మనస్సును చాటుకున్న జడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్..

Spread the love

జన సముద్రం న్యూస్, త్రిపురారం మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 3 :

చదువుకునే పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా సాయంత్రం సమయాలలో 10వ తరగతి విద్యార్థులకు “అల్పాహారం” అందించేందుకు త్రిపురారం జడ్పిటిసి దనవత్ భారతి భాస్కర్ నాయక్ తన వంతు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. త్రిపురారం మండలంలోని చెన్నై పాలెం ఉన్నత పాఠశాలలో అల్పాహారం అందించే విషయమై పాఠశాల ఉపాధ్యాయులు జెడ్పిటిసి ధనావత్ భారతీ భాస్కర్ నాయక్ ను అడగగా..” 5000 రూపాయల ఆర్థిక సహాయం” అందించారు.

జెడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆకలితో అలమటించోద్దని, చదువుకు ఆటంకం ఏర్పడవద్దనే ఉద్దేశంతో సాయంత్రం వేళ బిస్కెట్లు,పల్లి పట్టిలు,శనగలు అందించాలని 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులతోపాటు పాఠశాలకు పేరు,ప్రఖ్యాతలు తీసుకరావాలని భారతి భాస్కర్ నాయక్ తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి “ఉత్తీర్ణతతో” ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు సాయం చేసే విషయంలో వెనుకడుగు వేసేది లేదని భారతి భాస్కర్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతి భాస్కర్ నాయక్ తో పాటు గ్రామ సర్పంచ్ నామరాజు,మాజీ సర్పంచ్ సైదయ్య,ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు.. గోపి.. లు , ఉపాధ్యాయులు.. సత్యనారాయణ,సైదయ్య, అంజమ్మ,సైదులు, మ క్లానాయక్, ఎం ఎన్ స్వామి,మాలోతు దశరథ నాయక్, శ్రీదేవి, శ్రీనివాస్, దుర్గా మల్లేశ్వరి జ్యోతి తిరుపమ్మ… లు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి