బ్రూ సెల్లోసిస్ వ్యాధి నుంచి ఆవు దూడలను కాపాడుకోవాలి, ఫిబ్రవరి 4 పశు వైద్య శిబిరం ఏర్పాటు : డా. దుర్గా రమాదేవి..

Spread the love

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 3 :

పశువర్ధన శాఖ ఏర్పాటు చేసిన ప్రస్తుత గడ్డి విత్తనాలు మిర్యాలగూడ మండలంలోని మిర్యాలగూడ,తుంగపాడు , ఆలగడప పశువైద్య ఆసుపత్రిలో గడ్డి విత్తనాలు 75% సబ్సిడీ పైనే అందుబాటులో ఉన్నాయని ఆలగడప వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ “నాయిని దుర్గా రమాదేవి “తెలిపారు. ఇంతే కాకుండా మిర్యాలగూడ మండలంలో అల గడప, మిర్యాలగూడ, దొండవారిగూడెం, యాద్గారి పల్లి, గ్రామాలలో పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ గ్రామాలలో ఆవు దూడలు ఉన్న ప్రతి కుటుంబం, రైతులు.. ఆవు దూడలకు ఎటువంటి సమస్యలు ఉన్న “పశు వైద్య శిబిరాలకు” తీసుకొని రావాలని డాక్టర్ దుర్గా రమాదేవి అన్నారు.

4 నుంచి 8 నెలల వయసు గల ఆవు దూడలకు “బ్రు సెల్లోసిస్ “వ్యాధి రాకుండా ఆవు దూడలకు వైద్య శిబిరాలలో ” నివారణ టీకాలు” వేయిస్తున్నామని, ఇప్పటివరకు 313 ఆవు దూడలకు నివారణ టీకాలు వేశామని ఆలగడప వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ నాయిని దుర్గా రమాదేవి తెలిపారు.

బ్రు సెల్లోసిస్ అనే వ్యాధి ఆవు దూడలకు ఎలా వస్తుంది, వాటి నివారణ చర్యలు గురించి డాక్టర్ దుర్గా రమాదేవి మాట్లాడుతూ..

పశువుల నుండి మనుషులకు సోకే అతి ప్రమాదమైన వ్యాధిలో” బ్రూ సోలోసిస్ వ్యాధి” ఒకటని, ఈ వ్యాధి “బ్రాసెల్లా అబార్టిస్” అనే బ్యాక్టీరియా వల్ల పశువులలో సోకే ఈ వ్యాధిని “బ్యాంగ్స్ వ్యాధి” అని కూడా అంటారని డాక్టర్ దుర్గా రమాదేవి తెలిపారు. ఈ బ్రా సెల్లా సూక్ష్మజీవులు ఎక్కువగా పశువుల జ్ఞానేంద్రియాలను, పొదుగును ఆశించి ఆవు దూడలను వ్యాధి గ్రస్తులను చేసి, తద్వారా చూలి పశువుల్లో గర్భస్రావాలు, కోడె లు,దున్నల్లో సంతాన ఉత్పత్తి తగ్గిపోవడం సంభవిస్తుందని దుర్గా రమాదేవి తెలిపారు. ఈ వ్యాధి పశువులకు, గుర్రాలకు, మేకలకు, పందులకు, మనుషులకు సోకుతుందని ఇటువంటి వ్యాధి ఉన్న ఆవు దూడల వద్ద మనుషులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ దుర్గా రమాదేవి తెలిపారు.

వ్యాధి లక్షణాలు: వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం సంభవించినప్పుడు పిండం ద్వారా, గర్భకోశ స్రావాల ద్వారా సూక్ష్మజీవులు ఆవుల పీతను , నీటిని కలుషితం చేస్తాయని రమాదేవి తెలిపారు. ఈ వ్యాధి ఉన్న ఆవు కేసిన మేతను మిగిలిన పశువులు తీసుకోవడం ద్వారా మిగిలిన వాటికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలిపి ఈ బ్యాంగ్స్ వ్యాధి ఆవు దూడలకు రావటానికి ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయని, ఆవు దూడలు ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు ఈ వ్యాధి నివారణ చర్యలు తెలుసుకోవడానికి డాక్టర్ దుర్గా రమాదేవి ని సంప్రదించగలరని తెలిపారు.
ఫిబ్రవరి 4 శనివారం రోజున ఆలగడప గ్రామంలోని పశు వైద్యశాలలో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని ఆవు దూడలు ఉన్న ప్రతి కుటుంబ సభ్యులు తప్పక హాజరు అయి, ఈ బ్రు సెల్లోసిస్ వ్యాధి నుంచి ఆవు దూడలను కాపాడుకోవడానికి తగు జాగ్రత్తలు, సూచనలు, సలహాలు తెలుసుకొని ఈ వ్యాధి ద్వారా మనుషులకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని” డాక్టర్ నాయిని దుర్గా రమాదేవి” తెలిపారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి