మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 3
మెదక్ జిల్లా కొల్చారం మండలం సీతారాం తండాలు శుక్రవారం తెల్లవారుజామున సీతారాం తండాలో ఉన్న కళ్ళు దుకాణం రేకుల షెడ్డులో అదే తాండకు చెందిన, మాలోవత్ బాలు వయస్సు ( 36 )ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి భార్య సునీత ముగ్గురు పిల్లలు ఉన్నారని సీతారాం తాండవాసులు తెలిపారు. నివాసం సీతారాం తండా వయస్సు.36 సం.లు వృత్తి కూలి పనికి వెళ్తూ మద్యానికి బానిసై ఎటువంటి పనులు చేయకుండా ఇంటివద్ద ఉండగా కుటుంబ పోషణ కష్టం గా మారగా ఇదే విషయమై భార్యా భర్తలు తరచుగా గొడవలు పడినారని , మరియు మద్యం తాగటానికి మృతుడు గ్రామంలో చిన్న చిన్న అప్పులు చేసినాడు. అయితే తేదీ .01.02.23 నాడు మళ్ళీ ఇరువురు భార్యా భర్తలు గొడవ పడగ .నిన్న తేదీ రాత్రి 10 గంటలకు ఇద్దరు ఇంట్లో పడుకునగా మధ్య రాత్రి సునీత మేల్కొని లేచి చూడగా బాలు కనపడక పోగా వెతకగా తమ ఇంటి వెనకాల గల కళ్ళు దుకాణం రేకుల షెడ్డు లో గల ఇనుప రాడ్ కి టవల్ తో ఉరి వేసుకున్నాడని స్థానికులు తెలిపారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.