
జనసముద్రం న్యూస్,ఫిబ్రవరి 2:
అనంతపురం పట్టణంలో నిన్న సాయంకాలం తప్పిపోయిన పిల్లలు సాయి తేజ్, ప్రేమ్ తేజ్ ల వయసు 12 సంవత్సరాలు,స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు వీరు అందుబాటులో ఉన్న రైలు ఎక్కి గుంతకల్ చేరుకొని రైవేస్టేషన్ లో తచ్చాడుతుండగా గుంతకల్ రైల్వే ఎస్సై లు బి వేంకటేశులు,మహేష్ గారి ఆధ్వర్యంలో పోలీసులు సహృదయంతో చేరదీసి గ్లోబల్ హ్యుమన్ రైట్స్ (గ్రా) జిల్లా జనరల్ సెక్రెటరీ జే హరినాథ్ కు కాల్ చేసి విషయం తెలుపగా అతను వారి తండ్రులకు విషయం తెలిపి వారితో పాటుగా గుంతకల్ కు వెళ్లి పిల్లలను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చారు,ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మరియు జే హరినాథ్ గుంతకల్ రైల్వే ఎస్సై లు, పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు






