

రైల్వే కోడూరు నియోజకవర్గం, జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 4 ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం యస్్స్సీ,యస్.టీచేందీన పేదలకూ భూపంపిణీచేయాలని అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల తాసిల్దార్ గారికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి రాజబోయన సెల్వన్ కుమార్ ఆధ్వరంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది.శనివారం వారు మాట్లాడుతూ
పుల్లంపేట మండలంలో ఎస్సీ ఎస్టీ నిరుపేద అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్లకు ఎక్కడేగాని ఒక్క సెంటు కూడా భూమి లేదన్నారు .కూలినాలు చేసుకుంటూ పిల్లలను పోషించుకోలేక అష్ట కష్టాలు పడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ వారికి వెంటనే మండల పరిధిలో ఉన్నటువంటి భూములు ఎక్కడ ఉన్నా పరిశీలన చేసి, నిరుపేద అయినటువంటి వారికి జరగబోయే 8వ భూ పంపిణీ కార్యక్రమంలో పట్టాల మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నిరుపేద ఇటువంటి వారిని అందరిని కలుపుకొని, తాసిల్దార్ గారి కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేసుకుంటున్నాము.అని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సిపిఐ మండల సహాయ కార్యదర్శి
హరి నారాయణ . సిపిఐ నాయకులు .చెన్నూరు మహమ్మద్
మనీ. సుబ్బ నరసింహులు. సుబ్బరాయుడు. పెంచలయ్య
తదితరులు పాల్గొన్నారు