క్యాన్సర్ నివారణ పై అవగాహన సదస్సు

Spread the love

ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీపీ శిల్పవల్లి

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 04)

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన పెంపొందించే నిమిత్తం నల్లగండ్ల లో గల అమెరికన్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి, సిటిజెన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే వాక్ ను మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించి పాల్గొన్నారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి మనో ధైర్యన్ని అందించాలని సూచించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని , వైద్య విధానంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ఎటువంటి రోగాలనైనా పసిగట్టు గల సాంకేతికత అందుబాటులోకి వచ్చింది అన్నారు. క్యాన్సర్ వ్యాధిపై వివిధ మాధ్యమాల ద్వారా జరుగుతున్న ప్రచారాలను అర్థం చేసుకొని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ప్రజల్లో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్పొరేట్ ఆసుపత్రుల పై ఉందన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగిన నాడే రోగాన్ని నయం చేయగలమని సూచించారు అనంతరం ఆసుపత్రి ఆర్ సిఓఓ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ రోగులకు మెరుగైన సేవలను అందించేందుకు ఆసుపత్రి నిరంతరం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా నల్లగండ్ల నుండి బీహెచ్ఈఎల్ చెక్ పోస్ట్ వరకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజలతో కలిసి ఫ్ల కార్డులను చేతబట్టి క్యాన్సర్ పై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిటిజెన్ ఆసుపత్రి ఫెసిలిటీ డైరెక్టర్లు ప్రవీణ్ కుమార్, అంకిత పలు విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి