శాసనమండలి సభ్యులు ఎంసి. కోటిరెడ్డి సమక్షంలో “బి ఆర్ ఎస్” లో చేరిన కాంగ్రెస్ శ్రేణులు

Spread the love

జన సముద్రం న్యూస్, నాగార్జునసాగర్ నియోజకవర్గం, త్రిపురారం మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 30:

నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలంలో కాంగ్రెస్ పార్టీ గూటి నుంచి స్థానిక సంస్థల ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు ఎం సి. కోటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది కార్యకర్తలు బి ఆర్ఎస్ పార్టీలోకి చేరి ఎమ్మెల్సీ ఎంసి. కోటిరెడ్డి చేతుల మీదుగా బి ఆర్ఎస్ గులాబీ కండువాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కప్పుకున్నారు . కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరి వారిలో బె జ్జికల్ గ్రామ సర్పంచ్ గజ్జల కోటిరెడ్డి, ఆరుగురు వార్డు మెంబర్లు మరియు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు త్రిపురారం మండలం నుంచి బి ఆర్ఎస్ లో చేరారు.

స్థానిక సంస్థల ఉమ్మడి నల్గొండ జిల్లా శాసనమండలి సభ్యులు ఎం సి. కోటిరెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బి.ఆర్.యస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరి బి ఆర్ ఎస్
పార్టీ కండువాలు కప్పుకోవడం సీఎం కేసీఆర్ చేసే అభివృద్ధికి నిదర్శనమని ఎంసీ కోటిరెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం దేశమంతా అందించాలనే సంకల్పంతో సి.యం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు.ప్రతి బి.ఆర్.యస్ కార్యకర్తకు పార్టీ నిరంతరం అండగా,తోడుగా ఉంటుందన్నారు. బి ఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు వంద రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మృతి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల బీమా చెక్కును అందజేస్తుందని ఎంసీ. కోటిరెడ్డి అన్నారు. బిఆర్ఎస్ సభ్యత్వాలు నమోదులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో బి ఆర్ఎస్ పార్టీ ఉందని ఎం సి కోటిరెడ్డి తెలిపారు. అదే విధంగా శాసనమండలి సభ్యులు ఎం సి కోటిరెడ్డి నిధుల నుండి 5లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సి.సి రోడ్డు నిర్మాణ పనులకు ఎంసీ. కోటిరెడ్డిశంకుస్థాపన చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు
తిరుమలగిరిసాగర్ మండల యం.పి.పి భగవాన్ నాయక్, వేనిగడ్ల పి.ఏ.సి.యస్ చైర్మెన్ కెవి రామారావు,జిల్లా బి.ఆర్.యస్ నాయకులు మార్థి భరత్ రెడ్డి,రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ అనుముల అనంత రెడ్డి, నిడమనూరు మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ అంకతి వెంకట రమణ, బెజ్జకల్ మాజీ సర్పంచులు.. వింజం రాంరెడ్డి,ఇండ్ల జానకి రాములు.. లు ,మాజీ యం.పి.టి.సి కందుకూరి అంజయ్య,మాజీ మండల అధ్యక్షురాలు వింజం కవిత,బండారు ప్రసాద్,మర్రిగుడెం సర్పంచ్ శ్రీనివాస్,సొసైటీ డైరెక్టర్ నాగేందర్,గ్రామ శాఖ అధ్యక్షులు అల్గుబెల్లి వెంకన్న, వార్డ్ మెంబర్ పొదిల సైదులు, కొదాటి నరసింహ,పూసల నాగరాజు,బిట్టు సత్యనారాయణ,వింజం నారాయణమ్మ,త్రిపురారం రైతు బంధు సమితి అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి,యువ నాయకులు కోటిరెడ్డి,బి.ఆర్.యస్ నాయకులు నాగెడ్ల కృష్ణారెడ్డి,మండల,గ్రామ బి.ఆర్.యస్ పార్టీ నాయకులు,మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్