విద్యార్థులు శాస్త్రీయ ‌ఆలొచనలవైపు అడుగులు వేయాలి: ఎస్ఎఫ్ఐ మాజి జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ..

Spread the love

జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 30:

మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండలం కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ “ఎస్ఎఫ్ఐ” నల్లగొండ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల సందర్భంగా విద్యార్థుల తో భారీ ర్యాలీ నిర్వహించి, శిక్షణ తరగతులు ప్రారంభ సూచిక గా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ శిక్షణ తరగతులకు మాజీ ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..

దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‌పేద, మద్య తరగతి విద్యార్థిని,విద్యార్థుల “చదువులపై” తీవ్రమైన ఒత్తిడికి విద్యార్థిని,విద్యార్థులు గురవుతున్నార ని తెలిపారు. మన దేశంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను అభివృద్ధి చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతూ.. ‌పేద, మధ్యతరగతి విద్యార్థిని, విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయడం కోసం బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకున్నారని లక్ష్మీనారాయణ తమ ఆవేదనను వ్యక్తపరిచారు .దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి తీసుకోచ్చి, విద్యారంగాన్ని కాషాయికరణ చేయాలనే దృఢ సంకల్పం తో ముందుకు సాగుతోందని దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తామని,అందరికీ ఉచిత నిర్బంధ విద్య,ఉపాధి,వైద్యం కోసం ‌సమర శీల ఉద్యమాలు చేపట్టి దేశంలో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని లక్ష్మీనారాయణ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన గురుకులాలకు మరియు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అన్యంగా మెస్, కాస్మోటిక్ ఛార్జిలు పెంచాలని, అద్దె భవనాలలో ఉంటున్న గురుకుల పాఠశాలలకు, సంక్షేమ వసతి గృహాలకు, సోంతభవనాలునిర్మించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న సందర్భంగా విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలకు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.ఈదేశంలో అన్ని యూనివర్సిటీలో ఎస్ ఎఫ్ ఐ గెలుస్తుందంటే ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యార్థుల కోసం పని చేయడం వల్లనే భవిష్యత్తులో మిరందరు ఎస్ఎఫ్ఐ ని అగ్ర బాగా న అందరూ చూస్తారని లక్ష్మీనారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ తో పాటు డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వినోద్ నాయక్, గిరిజన సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు పాప నాయక్, సిఐటియు మండల కార్యదర్శి దయానంద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కోర్ర సైదా నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి బుడిగ వేంకటేష్ ,కోరె రమేష్, బిట్టు,రేణుక , జగన్, వధూద్, సమ్మద్, దామరచర్ల మండల కార్యదర్శి థీరవత్ వీరన్న, సూర్య ,వేములపల్లి మండల కార్యదర్శి పుట్ట సంపత్ , సాయి, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి