
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 30:
దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల అభివృద్ధి,సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించాలని “బీసీ సంక్షేమ సంఘం” రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు సోమవారం భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి బీసీ సంక్షేమ సంఘం కొరకు లక్ష కోట్లు కేటాయించాలని వ్రాసి లేఖ పంపినట్లు జాజుల లింగం గౌడ్ తెలిపారు.
జాజుల లింగం గౌడ్ బీసీలకు జరిగే అన్యాయం గురించి లేఖ ద్వారా ప్రధానమంత్రి కి చెబుతూ..
బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిలో ఉన్న,బీసీలకు ఏ విధమైన రాజ్యాంగ ఫలాలు అందడం లేదని జాజుల లింగం గౌడ్” బీసీ సంక్షేమ సంఘం “తరఫున తమ ఆవేదనను వ్యక్తం చేశారు.52 శాతానికి పైగా ఉన్న బీసీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపుల్లో ఎప్పుడూ “అన్యాయం” జరుగుతూనే ఉందని,.గత బడ్జెట్లో బీసీలకు కేవలం 2 వేల కోట్లు మాత్రమే కేటాయించారని, వీటితోటి బీసీలకు చాక్లెట్లు కూడా రావని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ తమ బాధను వ్యక్తపరిచారు. ఎస్సీ,ఎస్టీలకు బడ్జెట్ లో ఉన్న విధంగా “బీసీలకు” కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో లింగం గౌడ్ తో పాటు బంటు వెంకటేశ్వర్లు,జయమ్మ,గుండెబోయన నాగేశ్వరరావు యాదవ్,ఎర్రబెల్లి దుర్గయ్య, బంటు కవిత,దాసరాజ్ జయరాజ్,చేగొండి మురళి యాదవ్,సావిత్రి,రాజ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొని “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “కి బీసీలకు జరిగే అన్యాయం గురించి లేఖ ద్వారా తమ బాధని తెలిపారు.





