ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

Spread the love

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి :30

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా యెస్.పి .రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారు ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు చేయడం అయినది. ఈ కార్యక్రమంలో కొంపల్లి చెందిన నాగోల్ వినీల నిజాంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామ శివారులో 3 ఎకరాల 37 1/2 ఎకరాల పట్టా భూమిని అదే గ్రామానికి చెందిన లలిత,శిల్పలత ల వద్ద 2022 లో కొన్నామని అట్టి భూమిని సర్వే చెపితే 28 1/2 గంటల భూమి తక్కువా ఉన్నదని ఇట్టి విషయాన్ని
వారిని అడిగితే నీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకో మేము డబ్బుల ఇవ్వము భూమి ఇవ్వమని మమ్మల్ని నమ్మక ద్రోహం చేసినారని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని రామాయంపేట సి. ఐ గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే కోల్చారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కృష్ణ తన భార్య డిసెంబర్ నెలలో పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని తనకి ఇద్దరు పిల్లలు అని తన కొడుకు తన దగ్గర ఉన్నాడని తన భార్య బిడ్డను తీసుకుని వెళ్లిందని తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని కావున తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని కొల్చరం ఎస్.ఐ గారికి సూచనలు చేయటం జరిగింది. ఈ రోజు జిల్లా నలుమూలల నుండి పలు ఫిర్యాది దారులు రావడం జరిగినది.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి