మహా శక్తిగా మాదిగల ఐక్యవేదిక

Spread the love

రాజకీయాలకు దీటుగా మాదిగల ఐక్యత..

ఫిబ్రవరిలో 10 వేల మంది తో ఆత్మీయ సమ్మేళనం.
నియోజకవర్గ అధ్యక్షుడు రావులపల్లి రామమూర్తి.

జనసముద్రం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి.

కొత్తగూడెం జిల్లా
పినపాక నియోజకవర్గం మాదిగల ఐక్యవేదిక మణుగూరు కేంద్రంగా సోమవారం కార్యాలయం ప్రారంభించారు
ఈ సందర్భంగా నియోజవర్గంలోని ఏడు మండలాల మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు
మణుగూరు అంబేద్కర్ సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మొదటిగా పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చిన మాదిగ సోదరులందరూ జై భీమ్ నినాదాలతో నియోజకవర్గ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకొని మాదిగ ఐక్యవేదికల ప్రాంతీయ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా కుర్రి రాజేశ్వర్ రావు చేతుల మీదుగా మరియు ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని ప్రముఖ జర్నలిస్టు మాచర్ల శ్రీను లు ఆవిష్కరించారు. అనంతరం మాదిగ ఐక్య వేదిక నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు అధ్యక్షతన మాదిగ ఐక్యవేదిక పినపాక నియోజకవర్గ అధ్యక్షులు రావులపల్లి రామ్మూర్తి మాట్లాడుతూ…
నియోజకవర్గ మాదిగల అభ్యున్నతికి రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి మాదిగలందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 35 వేల మంది మాదిగలు ఉన్న అతిపెద్ద సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం అని రాజకీయాలను శాసించాల్సిన మాదిగలు దేహి అని అడుక్కోవడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల కమిటీలు ఏర్పాటు చేసామని మని ఆయన తెలిపారు మాదిగల ఐక్యతే ఐక్య వేదిక ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు
ఫిబ్రవరిలో మాదిగ సమ్మేళనం ఏర్పాటు చేసి సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు 7000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఆయన తెలిపారు రాజకీయ పార్టీ నాయకులారా మాదిగలను అణచాలని, శాసించాలని చూస్తే మాదిగల తిరగబడతారు అని, రోజులు మారాయి
మాదిగ ఐక్యంగా లేరు అనుకున్నారా..? ఏ సంఘానికి లేనివిధంగా మణుగూరు ప్రాంతంలో మాదిగల ఐక్యవేదిక నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించడం అంటేనే మా ఐక్యత కు నిదర్శనమని అన్నారు. రానున్న రోజుల్లో మాదిగలు మహాశక్తి గా తయారు చేసి మా హక్కులను మేమే సాధించుకుంటామని ,ఒకరి దగ్గర దేహి అని అడిగే పరిస్థితిలో ఉండమని ఆయన తెలిపారు


ఐక్యవేదిక ద్వారా ప్రతి మాదిగ కుటుంబాన్ని మాదిగ జాతిని రక్షించుకొని ముందుకు సాగుతూ వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తామని ఆయన అన్నారు అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ ఆశలకు అనుగుణంగా రాజకీయంగా ఆర్థికంగా అసమానతలు పోగొట్టే విధంగా సమాజంలో పేరుకుపోయిన అంటరానితన నిర్మూలనే లక్ష్యంగా మాదిగల ఐక్యవేదిక ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు ఈ సమావేశానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడు మండలాల నుండి తరలివచ్చిన మాదిగ జాతి మహనీయులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను అని మన ఐక్యతను చూసి చెవులు కొనుక్కోవడం ప్రారంభమైందని, ఇప్పటినుండి మన మందరం ఐక్యంగా ముందుకు వెళ్లి మన ఆశయాలను సాధించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఇసంపల్లి కృష్ణ,ట్రెజరర్ నల్లగట్ల రఘు,మీడియా సెల్ ఇంచార్జ్ సిద్దెల తిరుమల రావు,సహాయ కార్యదర్శి పొడుతూరి విక్రమ్,గొల్లపల్లి నరేష్,లింగంపల్లి రమేష్,ఐటీసీ ఉద్యోగులు కేసుపాక నరసింహారావు,మిరియాల నరసింహారావు,ఇస్రం శ్రీను,రాజబాబు,అవులూరి రమేష్,లాయర్లు గద్దల సాంబ,అశోక్,మీడియా విభాగం తోకల మోహన్ రావు,కోడారి వెంకటేశ్వర్లు,ఇల్లందుల సురేష్,పొడుతూరి ప్రసాద్,నైనారపు నాగేశ్వరరావు, సుధీర్,మందపాటి రాజు,నాయుకులు కలగూర శంకర్,కుమార్ స్వామి,గంగాధర్,పాపారావు,మహేష్,నాగరాజు,శివ,కాటూరి రాము,బీసీ సంఘం నాయుకులు రుద్ర నాగరాజు,సీపీఐ నాయుకులు సొందే కుటుంబరావు,నరేష్,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి