
జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట్ :జనవరి 30:ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి లో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….ఫిర్యాదుదారులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పవద్దన్నారు. ప్రతి ఫిర్యాదు ను నిర్ణిత సమయంలో పరిష్కారం చేయాలన్నారు. మున్సిపాలిటీ లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ వెంకటేష్ ను ఆదేశించారు. ధరణి సమస్యలు దాదాపుగా లేకుండా పోయాయాని ఏమైనా ప్రత్యేక కేసులు ఉంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం సర్వే నంబర్ 375 లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలనే విజ్ఞప్తిని పరిశీలించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.అంతకుముందు మున్సిపల్ కార్యాలయం లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటిక్యాల లోని రెండవ వార్డ్ లో కంటి వెలుగు శిభిరాన్ని పరిశీలించారు.ఈ సమావేశం లో తహసీల్దార్ జోత్స్న,ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి, ఏం ఈ ఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






