
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 29:
మిర్యాలగూడ పట్టణంలోని శాసనమండలి కార్యాలయం నందు టి ఎస్ సి పి ఎస్ ఈ యు ” తెలంగాణ కంట్రీ బ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగుల సంఘం” నూతన క్యాలెండర్ ను ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి చైర్మన్ “ఎంసీ. కోటిరెడ్డి” చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి చైర్మన్ ఎంసీ. కోటిరెడ్డి తో పాటు
జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్,ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్,కమిటీ సభ్యులు తదితరులు ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.





