
జన సముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు పరిధిలో గల కూనవరం గ్రామ పంచాయతీ కార్యాలయం నందు స్పర్శ లెప్రసీ అవగాహన ఉద్యమం ను గాంధీజి వర్ధంతి రోజున జనవరి 30 తేదీన గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రసాద్ , ప్రారంభించారు. ఈ కార్యక్రమం 15 రోజు ల పాటు ఫిబ్రవరి 13 వరకు లెప్రసీ సర్వే నిర్వహించి వంటి పై ముదురు రాగి రంగు మచ్చలు ఉండి స్పర్శ లేకుండా ఉంటే వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు పంపించాలని ఆశ కార్యకర్తల కు డాక్టర్.శివ కుమార్ సూచించారు.అనంతరం స్పర్శ లెప్రసీ మీద ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ కోటేశ్వరరావు, సబ్ యూనిట్ ఆఫీసర్ లింగ నాయక్, సూపర్ వైజర్ దయామనీ , రాంప్రసాద్, ఉమేష్, లక్ష్మి, చంద్రకుమారి, ఏవి లక్ష్మి, వీరమాతా , సెక్రెటరీ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






