ఉగాదిలోపు మిర్యాలగూడ నియోజకవర్గమును జిల్లాగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 29:

తెలుగు నూతన సంవత్సరం ఉగాది నాటికి మిర్యాలగూడ నియోజకవర్గమును నూతన జిల్లాగా ప్రకటించాలని మిర్యాల గూడ మాజీ శాసనసభ్యులు రేపాల శ్రీనివాస్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం స్థానిక అమరవీరల స్తూపం వద్ద పలువురు మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమకారులతో మాట్లాడుతూ..

జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని “అర్హతలు “అవకాశాలు మిర్యాలగూడకు ఉన్నాయన్నారు. జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ప్రజలందరిలో బలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లా ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు.మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లు సీఎం కేసీఆర్ కు తెలిపి రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఉగాదిలోపు జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించకపోతే కార్యచరణ ప్రకటిస్తామని అన్నారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు,ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొనాలని సూచించారు. అనంతరం కరాటే విద్యార్థులతో జిల్లా ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి విద్యార్థుల తల్లిదండ్రులకు జిల్లా ఏర్పాటు ఆవశ్యకత వివరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రేపాల శ్రీనివాస్ తో పాటు జిల్లా సాధన సమితి నాయకులు.. చేగొండి మురళి యాదవ్,దాసరాజు,జయరాజు, కరాటే మాస్టర్ రమేష్,మనోజ్, వేణుగోపాల్ రెడ్డి,సోమయ్య, రామయ్య ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొని మిర్యాలగూడను నూతన జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి