రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు

Spread the love

జనసముద్రం న్యూస్ జనవరి 28.
(అందోల్ నియోజకవర్గం ఇంచార్జి జనార్దన్ )

అమ్మవారు ఆదిత్యస్వరూపిణి. ఆ పరమేశ్వరి ద్వాదశాదిత్యులలో ఒకడైన మిత్రరూపిణి

వేదవ్యాస భాగవతంలో ద్వాదశాదిత్యుల గూర్చి ఇచ్చిన వివరణ అమ్మవారి మిత్రరూపిణీ యను నామమునకు సమన్వయించబడినది. ఆ శ్లోకవివరణ పఠించి అమ్మవారి అనుగ్రహముతో ఆయురారోగ్యములు పొందుదాము.

ఐదు వందల అరవై ఐద వ నామ మంత్రము

ఓం మిత్రరూపిణ్యై నమః

సూర్యునివలె అరుణ కాంతులతో ప్రకాశిస్తున్న పరమేశ్వరికి నమస్కారము.

శ్రీ లలితా సహహ్రనామావళి యందలి మిత్రరూపిణీ అను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును ఓం మిత్రరూపణ్యై నమః అని ఉచ్చరించుచూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగజ్జననిని ఉపాసించు భక్తుల అమ్మకరుణచే జ్ఞానసిద్ధులగుదురు మరియు శాశ్వతమైన బ్రహ్మానందమునంది తరించుదురు.

హిందూ పురాణాలలో అదితి కశ్యపుని యొక్క పండ్రెండు మంది పుత్రులను ఆదిత్యులు అందురు. వారు పండ్రెండుమంది గనుక ద్వాదశాదిత్యులు అని అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు:

శ్రీవేదవ్యాస విరచితమైన సంస్కృత మహాభాగవతంలో ద్వాదశ స్కంధం, పదకొండవ అధ్యాయములో ముప్పదియవ శ్లోకము నుండి నలుబది ఎనిమిదవ శ్లోకము వరకును వేదవ్యాసుల వారి ద్వాదశాదిత్యుల వర్ణ ఉన్నది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో ఆరాధింపబడుతుంటాడు. ఆదిత్యుని వెంట ఆరుగురు పరిజనులు ఉంటారు. వాఱు కూడా మాసాన్ని బట్టి మారుతుంటారు. కాలరూపధరుడైన నారాయణుడే సూర్యభగవానుడు. నారాయణుడు మరియు నారాయణి (అమ్మవారికి) అభేదమున్నది గనుక పరమేశ్వరియే ద్వాదశాదిత్యస్వరూపిణిగా భావించి ఆవివరణ ఇచ్చటనీయబడినది (కాస్త ఓపికగా చదివి భాగవత మహాపురాణము, శ్రీపరమేశ్వరీ నామ పారాయణము చేసిన పుణ్యము దక్కించుకొనందులకు విజ్ఞప్తి):-

ముఖ్యగమనిక:- ఈ వివరణలో భాద్రపదమాసమునకు పిమ్మట మాఘమాసము చెప్ఫబడినది. ఆవిధమగా మాసనామక్రమము ఉల్లంఘింపబడినది. మాసక్రమ ఉల్లంఘనంతు కూర్మోక్తాదిత్య కమాను సారేణ అని కూర్మపురాణమున చెప్పబడినరీతిగా ద్వాదశాదిత్యుల క్రమమును అనుసరించి, మాసనామములతో క్రమము పాటింపబడలేదు.

మాసక్రమమున క్లుప్తముగా ఆదిత్యులు మరియు వారి పరివారములు

ధాత- మాసం: చైత్రం – పరిజనులు: కృతస్థలి (అప్సరస), హేతి (రాక్షసుడు), వాసుకి (నాగువు), రథకృత్తు (యక్షుడు), పులస్త్యుడు (ఋషి), తుంబురుడు (గంధర్వుడు)

అర్యముడు – మాసం: వైశాఖం – పరిజనులు: పుంజికస్థలి (అప్సరస), పులహుడు (రాక్షసుడు), ఓజస్సు (నాగువు), ప్రహేతి (యక్షుడు), నారదుడు (ఋషి), కంజనీరుడు (గంధర్వుడు)

మిత్రుడు – మాసం: జ్యేష్ఠం – పరిజనులు: మేనక (అప్సరస), పౌరషేయుడు (రాక్షసుడు), తక్షకుడు (నాగువు), రథస్వనుడు (యక్షుడు), అత్రి (ఋషి, హాహా (గంధర్వుడు)

వరుణుడు – మాసం: ఆషాఢం – పరిజనులు: రంభ, శుక్రచిత్తు సహజన్యుడు, హూహూ, వసిష్ఠుడు, సృనుడు

ఇంద్రుడు – మాసం: శ్రావణం – పరిజనులు: విశ్వావసువు, శ్రోత, ఏలా పుత్రుడు, అంగిరసు, ప్రమ్లోచ, చర్యుడు

వివస్వంతుడు- మాసం: భాద్రపదం – పరిజనులు: అనుమ్లోద, ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు, శంఖపాలుడు

అంశుమంతుడు – మాసం: మార్గశిరం – పరిజనులు: కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేన, ఊర్వశి, విద్యుచ్ఛత్ర, మహాశంఖులు

త్వష్ట- మాసం: ఆశ్వయుజం – పరిజనులు: జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు.

విష్ణువు – మాసం: కార్తీకం- పరిజనులు: అశ్వతరుడు, రంభ, సూర్యవర్చుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఖాపేతుడు

భగుడు – మాసం: పుష్యం- పరిజనులు: స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణువు, ఆయువు, కర్కోటకుడు, పూర్వజిత్త

పూషుడు- మాసం: మాఘం – పరిజనులు: ధనుంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతావి, గౌతముడు

క్రతువు (పర్జన్యుడు) మాసం: ఫాల్గుణం – పరిజనులు: వర్చుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు

ఇంకా భాగవతంలో శౌనకుడు సూతునకిలా చెప్పాడు – ఈ పన్నెండుగురు ఆదిత్యులును విష్ణువుయొక్క సూర్యరూప విభూతులు. సూర్యుని వెంబడించేవారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు. గంధర్వులు గానాన్ని చేస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తుంటారు. నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. యక్షులు రథయోజన చేస్తారు. రాక్షసులు రథాన్ని వెనుకనైపునుండి తోస్తుంటారు. వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరువదివేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిన ప్రస్తుతిస్తుంటారు.

ఏక ఏవ హి లోకానాం సూరఆత్మాఽఽదికృద్ధరిః|

సర్వవేదక్రియామూలమృషిభిర్బహుధోదితః
వాస్తవముగా సమస్తలోకములయొక్క ఆత్మయు, ఆదికారణుడును శ్రీహరియే. అతడే అంతర్యామిరూపములో నున్న సూర్యుడు. అతడు ఒక్కడేయైనను పరాశరాది ఋషులు అతనిని పండ్రెండు రూపములలో వర్ణించిరి. అవియే వైదిక క్రియలకు మూలములు
కాలో దేశః క్రియా కర్తా కరణం కార్యమాగమః|

ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్నవధోక్తోఽజయా హరిః॥

బ్రాహ్మణోత్తమా! శౌనకమహర్షీ! ఆ పరమాత్మయే మాయద్వారా కాలము, దేశము, యజ్ఞాదిక్రియలు, కర్త, స్రువము మొదలగు ఉపకరణములు, యాగాదికర్మలు, వేదమంత్రములు, చరు, పురోడాశాది హవిర్ ద్రవ్యములు, ఫలము అని తొమ్మిది విధములుగా పేర్కొనబడెను
*మధ్వాదిషు ద్వాదశసు భగవాన్ కాలరూపధృక్|
లోకతంత్రాయ చరతి పృథగ్ద్వాదశభిర్గణై

కాలరూపధరుడైన సూర్యభగవానుడు (శ్రీహరియే) లోకవ్యవహారములను చక్కగా నడిపించుటకై చైత్రాది పండ్రెండు మాసములలో వేర్వేరు పన్నెండు గణములతో గూడి తిరుగుచుండును.
చైత్రమాసమునందు ఆదిత్యుడు – ధాతా
ధాతా కృతస్థలీ హేతిర్వాసుకీ రథకృన్మునే|

పులస్త్యస్తుంబురురితి మధుమాసం నయంత్య

శౌనకమహర్షీ! ధాతా అను పేరుతో ఒప్పెడి సూర్యునితో కృతస్థలీ అను అప్సరస, హేతి అను రాక్షసుడు, వాసుకి అను సర్పము, రథకృత్తు అను యక్షుడు, పులస్త్యుడు అను మహర్షి, తుంబురుడు అను గంధర్వుడు అనువారు చైత్రమాసమునందు తమతమ కార్యములను నిర్వహించు చుందురు.

వైశాఖమాసమునందు ఆదిత్యుడు – అర్యముడు

అర్యమా పులహోఽథౌజాః ప్రహేతిః పుంజికస్థలీ|

నారదః కచ్ఛనీరశ్చ నయంత్యేతే స్మ మాధవమ్॥

వైశాఖ (మాధవ) మాసమునందు అర్యముడు అను సూర్యునితోగూడి, పులహుడు అను ఋషి, అధౌజుడు అను యక్షుడు, ప్రహేతి అను రాక్షసుడు, పుంజికస్థలీ అను అప్సరస, నారదుడు అను గంధర్వుడు, కచ్ఛనీరుడు అను సర్పము ఆయా కార్యములను నెరపుచుందురు.

జ్యేష్ఠమాసమునందు ఆదిత్యుడు – మిత్రుడు
మిత్రోఽత్రిః పౌరుషేయోఽథ తక్షకో మేనకా హహాః|

రథస్వన ఇతి హ్యేతే శుక్రమాసం నయంత్యమీ

శుక్ర (జ్యేష్ఠ) మాసమునందు మిత్రుడు అను సూర్యునితో గూడి, అత్రి అను ఋషి, పౌరుషేయుడు అను రాక్షసుడు, తక్షకుడు అను సర్పము, మేనక అను అప్సరస, హాహా అను గంధర్వుడు, రథస్వనుడు అను యక్షుడు, కార్యనిర్వహణ చేయుదురు.

ఆషాఢమాసమునందు ఆదిత్యుడు – వరుణుడు

వసిష్ఠో వరుణో రంభా సహజన్యస్తథా హుహూః|

శుక్రశ్చిత్రస్వనశ్చైవ శుచిమాసం నయంత్యమీ॥

శుచి (ఆషాఢ) మాసమున వరుణుడు అను పేరుగల సూర్యునితోగూడి వసిష్ఠుడు అను ఋషి, రంభ అను అప్సరస, సహజన్యుడు అను యక్షుడు హూహూ అను గంధర్వుడు, శుక్రుడు అను సర్పము, చిత్రస్వనుడు అను రాక్షసుడు, తమ తమ కార్యములను నిర్వహింతురు.

*శ్రావణమాసమునందు ఆదిత్యుడు – ఇంద్రుడు

ఇంద్రో విశ్వావసుః శ్రోతా ఏలాపత్రస్తథాంగిరాః|

ప్రమ్లోచా రాక్షసో వర్యో నభోమాసం నయంత్యమీ॥

నభో (శ్రావణ) మాసమునందు ఇంద్రుడు అను పేరుగల సూర్యునితోగూడి, విశ్వావసుడు అను గంధర్వుడు, శ్రోత అను యక్షుడు, ఏలాపత్రుడు అను సర్పము, అంగిరసుడు అను ఋషి, ప్రమ్లోచ అను అప్సరస, వర్యుడు అను రాక్షసుడు తమ తమ కృత్యములను నిర్వర్తింతురు.

భాద్రపదమాసమునందు ఆదిత్యుడు – వివస్వంతుడు
వివస్వానుగ్రసేనశ్చ వ్యాఘ్ర ఆసారణో భృగుః|

అనుమ్లోచా శంఖపాలో నభస్యాఖ్యం నయంత్యమీ॥

నభస్య (భాద్రపద) మాసమునందు వివస్వంతుడు అను సూర్యునితోగూడి, ఉగ్రసేనుడు అను గంధర్వుడు, వ్యాఘ్రుడు అను రాక్షసుడు, ఆసారణుడు అను యక్షుడు, భృగువు అను ఋషి, అనుమ్లోచ అను అప్సరస, శంఖపాలుడు అను సర్పము ఆయా కార్యములను నడుపుచుందురు.

మాఘమాసమునందు ఆదిత్యుడు – పూషుడు

పూషా ధనంజయో వాతః సుషేణః సురుచిస్తథా|

ఘృతాచీ గౌతమశ్చేతి తపోమాసం నయంత్యమీ॥

తపో (మాఘ) మాసమునందు య్పూషుడు (పూష) అను సూర్యునితోగూడి ధనంజయము అను సర్పము, వాతుడు అను రాక్షసుడు, సుషేణుడు అను గంధర్వుడు, సురుచి అను యక్షుడు, ఘృతాచి అను అప్సరస, గౌతముడు అను ఋషి, తమ కార్యములను నిర్వహించు చుందురు.

ఇచట భాద్రపదమాసమునకు పిమ్మట మాఘమాసము పేర్కొనబడినది. మాసనామక్రమము ఉల్లంఘింపబడినది. మాసక్రమ ఉల్లంఘనంతు కూర్మోక్తాదిత్యక్రమాను సారేణ అని కూర్మపురాణమున చెప్పబడిన రీతిగా ద్వాదశాదిత్యుల క్రమమును అనుసరించి, మాస నామములతో క్రమము పాటింపబడలేదు. (వీరరాఘవీయ వ్యాఖ్య)

ఫాల్గుణ మాసమునందు ఆదిత్యుడు – పర్జన్యుడు
క్రతుర్వర్చా భరద్వాజః పర్జన్యః సేనజిత్తథా|
విశ్వ ఐరావతశ్చైవ తపస్యాఖ్యం నయంత్యమీ॥

తపస్య (ఫాల్గుణ) మాసమునందు పర్జన్యుడు అను సూర్యునిగూడి క్రతువు అను యక్షుడు, వర్చ అను రాక్షసుడు, భరద్వాజుడు అను ఋషి, సేనజిత్తు అను అప్సరస, విశ్వుడు అను గంధర్వుడు, ఐరావతము అను సర్పము తమ తమ కార్యములను నెఱపుచుందురు.

మార్గశిర మాసమునందు ఆదిత్యుడు – అంశువు
అథాంశుః కశ్యపస్తార్క్ష్య ఋతసేనస్తథోర్వశీ|

విద్యుచ్ఛత్రుర్మహాశంఖః సహోమాసం నయంత్యమీ॥

సహము (మార్గశిరము) మాసమునందు అంశువు అను సూర్యునితోగూడి, కశ్యపుడు అను ఋషి, తార్ క్ష్యుడు అను యక్షుడు, ఋతసేనుడు అను గంధర్వుడు, ఊర్వశి అను అప్సరస, విద్యుచ్ఛత్రువు అను రాక్షసుడు, మహాశంఖము అను సర్పము తమ కార్యములను నిర్వహింతురు.

పుష్య మాసమునందు ఆదిత్యుడు – భగుడు

భగః స్ఫూర్జోఽరిష్టనేమిరూర్ణ ఆయుశ్చ పంచమః|

కర్కోటకః పూర్వచిత్తిః పుష్యమాసం నయంత్యమీ॥

పుష్యమాసమునందు భగుడు అను సూర్యునితోగూడి, స్ఫూర్జుడు అను రాక్షసుడు, అరిష్టనేమి అను గంధర్వుడు, ఊర్ణుడు అను యక్షుడు, ఆయువు అను ఋషి, కర్కోటకము అను సర్పము, పూర్వజిత్తు అను అప్సరస ఆయా కార్యములను నెరవేర్తురు.

ఆశ్వయుజ మాసమునందు ఆదిత్యుడు – త్వష్ణ

త్వష్టా ఋచీకతనయః కంబలశ్చ తిలోత్తమా|

బ్రహ్మాపేతోఽథ శతజిద్ధృతరాష్ట్ర ఇషంభరాః॥

ఇషంభర (ఇషము – ఆశ్వయుజ) మాసమునందు త్వష్ట అను సూర్యునితోగూడి, ఋచీకుని తనయుడగు జమదగ్ని అను ఋషి, కంబళము అను సర్పము, తిలోత్తమ అను అప్సరస, బ్రహ్మాపేతుడు అను రాక్షసుడు, శతజిత్తు అను యక్షుడు, ధృతరాష్ట్రుడు అను గంధర్వుడు తమ కార్యములను చక్కబెట్టుదురు.

కార్తీక మాసమునందు ఆదిత్యుడు – విష్ణువు
విష్ణురశ్వతరో రంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్|

విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ॥

ఊర్జ (కార్తీక) మాసమునందు, విష్ణువు అను సూర్యునితోగూడి, అశ్వతరము అను సర్పము, రంభ అను అప్సరస, సూర్యవర్చుడు అను గంధర్వుడు, సత్యజిత్తు అను యక్షుడు, విశ్వామిత్రుడు అను ఋషి, మఖాసేతుడు అను రాక్షసుడు తమతమ కార్యములను నెరవేర్చుదురు
ఏతా భగవతో విష్ణోరాదిత్యస్య విభూతయః|

స్మరతాం సంధ్యయోర్నౄణాం హరంత్యంహో దినే దినే॥

శౌనకమహర్షీ! ఇవి అన్నియును సూర్యరూపుడైన శ్రీమహావిష్ణువు యొక్క విభూతులు. ప్రతిదినము ప్రాతఃకాలమునందును, సాయంకాలము నందును వీటిని స్మరించినవారి పాపములన్నియును నశించును.
ద్వాదశస్వపి మాసేషు దేవోఽసౌ షడ్భిరస్య వై|

చరన్ సమంతాత్తనుతే పరత్రేహ చ సన్మతిమ్॥
సూర్యభగవానుడు పన్నెండు మాసముల యందును తన గణములోని ఆరుగురితోగూడి సంచరించుచు, ఇహపరలోకముల
యందు సద్బుద్ధిని విస్తరింపజేయును.
సామర్గ్యజుర్భిస్తల్లింగైరృషయః సంస్తువంత్యముమ్|

*గంధర్వాస్తం ప్రగాయంతి నృత్యంత్యప్సరసోఽగ్రత
ఉన్నహ్యంతి రథం నాగా గ్రామణ్యో రథయోజకాః|

చోదయంతి రథం పృష్ఠే నైరృతా బలశాలిన॥

సూర్యభగవానుని గణమునందు ఋషులు సూర్యునకు సంబంధించిన ఋగ్యజుస్సామవేద మంత్రములద్వారా ఆ ప్రభువులు స్తుతింతురు. గంధర్వులు ఆ స్వామి యశస్సును గానము చేయుదురు. అప్సరసలు ఆ పరమాత్మకు ముందు భాగమునజేరి, నృత్యములు సలుపు చుందురు. సర్పములు త్రాళ్ళవలె రథములను బంధించి (చుట్టుకొని) వాటిని ప్రయాణమునకు అనువుగా సిద్ధపరచును. యక్షులు రథమును అలంకరింతురు. బలశాలులైన రాక్షసులు ఆ రథమునకు వెనుక భాగమున జేరి, దానిని త్రోయుచు నడపుచుందురు.

ద్వాదశాదిత్యుల వలెనే సూర్యునికి గల కళలను కూడా ఆదిత్యకళలు లేదా సూర్యకళలు అందురు.

ఒకటి తపిని, రెండు . తాపిని, మూడు . ధూమ్ర, నాలుగు . మరీచి, ఐదు . జ్వాలిని, ఆరు . రుచి, ఏడు . సుషుమ్న, ఎనమిది . భోగద, తొమ్మిది . విశ్వబోధిని, పది.ధరణి,పదకొండు . క్షమ, పన్నెండు . ప్రభ (శివతత్త్వరత్నాకరము, నూతయాభై మూడవ పుట). అమ్మవారికి షోడశ (పదహారు) చంద్రకళలు ఏవిధముగానైతే గలవో ద్వాదశ సూర్యకళలు కూడా గలవు. గనుకనే అమ్మవారు ద్వాదశాదిత్యులలో ఒకడైన మిత్ర అను అదిత్య స్వరూపిణి గనుక అమ్మవారు మిత్రరూపిణీ యని అనబడినది.

అటువంటి శ్రీమాతకు నమస్కరించునపుడు ఓం మిత్రరూపిణ్యై నమః అని అనవలెను.
అని ”యోగ ఆసనాల లో మొట్ట మొదలు సూర్యనమస్కారాలకే ప్రాదాన్యత” అని యోగగురువులు అంటారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్