
జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మణుగూరు నందు 23 మంది గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ న్యూట్రియంట్స్ కిట్స్ ను డాక్టర్. శివ కుమార్ అందచేశారు. ఈ కిట్స్ లో పోషకాహార పదార్థాలు ఐన కర్జూరం, హార్లిక్స్ , మరియు ఐరన్ సిరప్స్ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రక్త హీనత తో బాధపడుతున్న వారికి మంచి పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు కావాలని, కాన్పు ఐన కెసిఆర్ కిట్టు మరియు పారితోషికం అందు తున్నది అని సూచించారు. ఈ కార్యక్రమం లో ఆసుపత్రి సిబ్బంది , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు .





