
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 28.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండల కేంద్రంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం సుమారు కోటి 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతున్నది అన్నారు.వైద్యం విషయాల్లో ప్రత్యేక దృష్టి సారించి సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.అన్ని రకాల వైద్య సేవలు ఉండాలని సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వం అందించడం జరుగుతున్నదని, తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి కోట్ల రూపాయల నిధులను కేటాయించి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు.తెలంగాణలో దేశంలోని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు.ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగానికి నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యత కలిపిస్తున్నారని గుర్తు చేశారు.





