ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Spread the love

జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,పినపాక, జనవరి 28.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని దేశంలోనే తెలంగాణ మహిళలు ఆదర్శంగా నిలవాలని అన్నారు.మహిళలు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సీఎం కేసీఆర్ సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని, ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో నియోజకవర్గంలో మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలోనూ ఒక విజన్ తో ముందుకు సాగుతున్నామన్నారు.ఈ ప్రాంతంలోని మహిళలు స్వయం శక్తితో ఎదగాలని కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండలం బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి