
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి: 28
మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే మనసున్న మారాజు సరస్వతి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేడి పంతున్లు ప్రత్యేక పూజలు చేశారు. కిష్టాపూర్ గ్రామంలో నుండి సరస్వతి విగ్రహాన్ని డప్పు చప్పులతో ఊరేగింపుగా పాఠశాల ఆవరణము వరకు ఊరేగింపు తీసుకొచ్చారు. స్థానిక గ్రామ సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో సరస్వతి విగ్రహం స్కూల్ ఆవరణలో పెట్టడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం జడ్పిటిసి మేఘముల సంతోష్ కుమార్, కోరబోయిన మంజుల కాశీనాథ్, మెదక్ మార్కెట్ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, ఎంపీడీవో గణేష్ రెడ్డి, ఆర్ ఐ శ్రీహరి, గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్, కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు, విద్యార్థి విద్యార్థినులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






