
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణు జె, జనవరి 28:
జల సాధన సమితి ద్వారా ఫ్లోరైడ్ బాధితుల బాధలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడంలో కీలక పాత్ర వహించిన “ఫ్లోరైడ్ విముక్తి యోధుడు “అంశాల స్వామి 32 సంవత్సరాల చిన్న వయసులోనే మృతి చెందడం పట్ల మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి లోనయ్యి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భాస్కర్ రావు అంశాల స్వామి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ స్వామి కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.
అంశాల స్వామి గురించి శాసనసభ్యులు భాస్కర్ రావు మాట్లాడుతూ..
పుట్టుకతో ఫ్లోరోసిస్ బాధితుడిగా ఉన్న “అంశాల స్వామి ” అంగవైకల్యం ఉన్న, తన మనోధైర్యంతో భవితరాలు ఫ్లోరోసిస్ బారినపడకూడదని, నల్లగొండ జిల్లాలో ఏ కుటుంబం ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడకూడదని అంశాల స్వామి జల పోరాట సమితి ద్వారా ఫ్లోరోసిస్ అంత మొం దించేందుకు పోరాటాన్ని ఉధృతం చేసిన మహానీయుడు “అంశాల స్వామి అన్నారు. ఇంతే కాకుండా ఫ్లోరోసిస్ రాక్షసిని తరిమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడి ఢిల్లీ రాజకీయ నాయకులను సైతం లెక్కచేయకుండా ఫ్లోరో సిస్ కు వ్యతిరేకంగా తన గళం వినిపించిన ధైర్యశాలి ” అంశాల స్వామి” అని, అంకాల స్వామి మృతి తనను ఎంతో కలచివేసిందనిని , అంశాల స్వామి కు భాస్కర్ రావు తమ “కన్నీటితో” నివాళులు తెలి పి, స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్టు భాస్కర్ రావు అన్నారు.






