
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 28:
మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సామాజికవేత్త, మిర్యాలగూడ మున్సిపల్ ఫోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి విచ్చేసి గంగమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు బత్తుల లక్ష్మారెడ్డి తీసుకున్నారు. ఇంతే కాకుండాగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవమునకు విచ్చేస్తున్న భక్తులకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో “మహా అన్నదాన కార్యక్ర మమును” నిర్వహించడం జరిగింది. గంగమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో బత్తుల లక్ష్మారెడ్డి నిర్వహించిన అన్నదానా న్ని స్వీకరించిన అమ్మవారి భక్తులందరూ “అమ్మవారి దీవెనలతో” లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, బత్తుల లక్ష్మారెడ్డి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, “నిరుపేదల” కుటుంబాలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బత్తుల లక్ష్మారెడ్డి తో పాటు బి ఎల్ ఆర్ బ్రదర్స్, కాంగ్రెస్ నాయకులు, గుడి పూజారులు, అమ్మవారి భక్తులు, బి ఎల్ ఆర్ అభిమానులు తదితరులు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్నారు.






