
జనసముద్రం న్యూస్ జనవరి 26: డిండి గుండ్లపల్లి ప్రతినిధి:(కాసుల ఐలేష్ చారి)
నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 74 వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రభాతభేరి నిర్వహించారు.
ప్రభాతభేరిలో వివిధ వేషధారణలో పాల్గొన్న విద్యార్థులు వీధుల కూడళ్లలో లేజమ్స్ ద్వారా ప్రదర్శనలిచ్చి నాట్యము,పాటల ద్వారా ప్రజలకు కన్నుల విందు చేశారు.విద్యార్థుల నాట్యప్రదర్శనను తిలకించిన ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు.అనంతరంపాఠశాలప్రధానోపాధ్యాయులు ఎల్ సత్యనారాయణ పాఠశాలలో జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం నిర్వహించిన సమావేశంలో గణతంత్ర దినోత్సవ సందర్బంగా నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కాసుల ఐలేష్ చారి,చింతపల్లీ నరేష్,గుజ్జారి గణేష్ ఆర్థిక సహకారంతో అందజేసిన టై బెల్టులను మండల విద్య అధికారి సామ్య నాయక్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి ఛైర్మన్ బద్దెల తిరుపతయ్య,ఎస్ఎంసి వైస్ ఛైర్మన్ సిహెచ్.లక్ష్మమ్మ సభ్యులు ఆనంద్,రామచంద్రయ్య,శ్రీను,ఐలేష్ చారి,ఉపాధ్యాయులుపరంగి,రామారావు,భద్రావతి,హేమలత,సారిక,ఉమాదేవి విద్యార్థుల తల్లిదండ్రులు పి.సురేష్,కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.






