సత్యమేవ జయతే” ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Spread the love

◆ ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త కర్నె రవి.
◆ జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 26.

పినపాక మండలంలోని సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్, ప్రధాన కార్యదర్శి నిట్టా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ స్వతంత్ర సమరయోధులకు పూలమాలవేసి నివాళులర్పించారు.ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం గర్వించదగ్గ విషయం అన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది,సామాజిక కార్యకర్త కర్నె రవి పాల్గొని, మాట్లాడుతూ మహనీయులు అందరికీ సమానత్వపు, స్వేచ్ఛ హక్కు కల్పిస్తూ ప్రజల చేత ప్రజాస్వామ్యాన్ని ఏర్పరిచే విధంగా రాజ్యాంగాన్ని రచించి దేశానికి అంకితం ఇచ్చిన స్వతంత్ర సమరయోధులను, రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకున్నారు.భారత రాజ్యాంగం వల్ల దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ గుండు నరసింహ మూర్తి, ట్రెజరర్ కన్నె రమేష్, సంస్కృతిక క్రీడా విభాగం తోకల శెంకర్, అండెం యాకన్న, రియాజ్, దొడ్డ శ్రీనివాస్ ,వింజమూరి సతీష్, గుమాసు వెంకటేశ్వర్లు, కల్తి ప్రభాకర్, జాడి శ్రీనివాస్, మీసేవ నిర్వాహకులు సోంపెల్లి శ్రీను, తోగ్గూడెం బి ఆర్ ఎస్ నాయకులు పుప్పాల నరసింహారావు, బుడగం సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి