
జనసముద్రం న్యూస్:జనవరి,26.
శ్రీ సత్యసాయి జిల్లా:
జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:
అమడగూరు న్యూస్: మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలు,కార్యాలయాలలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు.మొదట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ జాతీయ జెండా ఎగరవేశారు.తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రెడ్డి శేఖర్,మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నసీమా,ఐకేపీ కార్యాలయంలో ఏపియం గోపాల్,సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ చంద్ర,డిజిటల్ అసిస్టెంట్ అశోక్,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రభాకర్,ఏపి మోడల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు,కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో యస్ఓ అంబిక,ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రమణ,అంగన్వాడీ కేంద్రాలు,ప్రవేటు పాఠశాలలో సంబందిత అధికారులు జెండా ఎగరవేశారు.మొదట విద్యార్థులు పూర వీధులలో దేశ నాయకుల వేషధారణ దరించి దేశ నాయకులను స్మరించుకుంటూ నినాదాలుతో ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాలుగు సంవత్సరాలకు 1950లో సంపూర్ణ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు.అంతవరకు బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేదని వారిని మన దేశం నుండి తరిమికొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని రచించుకొని ఘనతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు.కావున ప్రతి ఒక్కరు భారతదేశం అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







