ప్రజా సమస్యల పరిష్కారమే యువగళం ధ్యేయం.

Spread the love

✦యువ గళానికి ప్రజలే సైనిక దళం.

✦పాదయాత్రకు వైకాపా ప్రభుత్వం ఆంక్షలు సరికాదు.

✦లోకేష్ పాదయాత్ర వైకాపా పాలనకు అంతిమయాత్ర అవుతుంది.

✦లోకేష్ పాదయాత్రతో యువతలో నూతనోత్తేజం.

✦లోకేష్ పాదయాత్రకు యువత సంపూర్ణ మద్దతు.

✦టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్.

జనసముద్రం న్యూస్:జనవరి,26.
శ్రీ సత్యసాయి జిల్లా:
జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:

శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి న్యూస్: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,యువనేత నారా లోకేష్ బాబు నేడు (శుక్రవారం) ఉదయం చిత్తూరు జిల్లా కుప్పం నుంచి చేపట్టబోయే యువగళం పాదయాత్రకు ప్రజలే సైనిక దళంగా ఉంటారని టిడిపి వడ్డెర సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే వెంకట్ పేర్కొన్నారు.గురువారం సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని తన నివాసంలో మీడియాతో వడ్డే వెంకట్ మాట్లాడుతూ…రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైకాపా పాలన పట్ల విసుగు చెందారని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర చేస్తున్నారని లోకేష్ బాబు పాదయాత్రకు వైకాపా ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదని వడ్డే వెంకట్ వైకాపా ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.లోకేష్ బాబు పాదయాత్ర తేదీ ప్రకటించిన దగ్గర నుంచే జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే పాదయాత్రను అడ్డుకోవడానికి నిబంధనలు పేరిట ఆంక్షలు విధిస్తున్నారన్నారు.లోకేష్ బాబు పాదయాత్ర వైకాపా పాలనకు అంతిమయాత్ర అవుతుందని జగన్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్రను అడ్డుకోలేరని తెలిపారు.రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరాశ నిస్పృహలతో ఉన్నారని వారి గొంతుకను బలంగా ప్రజల్లో వినిపించడానికి లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు రాష్ట్రంలోని యువత,అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వడ్డే వెంకట్ తెలిపారు.రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో వైకాపా డిపాజిట్లు కోల్పోతుందని ఖాయమని వడ్డే వెంకట్ ధీమా వ్యక్తం చేశారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్