గవర్నర్ను కలిసి ప్రభుత్వ పరువు తీశారు అంటూ..ఉద్యోగ సంఘాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏపి సర్కార్

Spread the love
జనసముద్రం న్యూస్:జనవరి,24:

దేశంలోనే తొలిసారిగా సర్కార్ పరువు తీసిన ఘటన ఏపీలోనే జరిగింది. దానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కారణం. దాంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు అవమాన భారంతో రగిలిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం మీద ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు రాజ్యాంగ రక్షకుడు గవర్నర్ కి ఫిర్యాదు చేయడం అన్నది చాలా దారుణమైన విషయంగానే చూస్తారు.

ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఎపుడూ ప్రభుత్వంతో చర్చిస్తూ ఉంటారు. కుదరకపోతే ఆందోళన బాట పడతారు. అటూ ఇటూ పంతానికి పోయిన సందర్భంలో కూడా చర్చలకు ఆస్కారం ఎపుడూ ఉండేది. ఎంతో మంది ముఖ్యమంత్రులు దేశంలో వచ్చినా వారిలో కొందరు మొండిగా ఉన్నా ఉద్యోగులు ఎపుడూ వారితోనే చర్చలు జరిపి తమ డిమాండ్లు నెరవేర్చుకున్నారు తప్ప హద్దులు దాటలేదు.
మరి ఏపీలో అయితే ఏం జరిగిందో ఏమో కానీ ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా గవర్నర్ తో భేటీ కోసం రాజ్ భవన్ మెట్లు ఎక్కారు. తమ సమస్యలతో పాటు ప్రభుత్వం మీద గట్టిగానే ఫిర్యాదు చేసి వచ్చారు. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి తలవంపులుగా పరిణమించింది. మరో వైపు చూస్తే సర్వీస్ నిబంధనలకు కూడా ఇది విరుద్ధం కావడంతో ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించకుండా తాను ఏమి చేయాలో చేసి చూపించింది.
అంతే ఇటీవల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశమైనందుకు గానూ  రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి షోకాజ్ నోటీసులు వచ్చాయి. ఆ నోటీసులను సైతం మీడియాలో పత్రికలలో వచ్చిన కధనాల ఆధారంగానే ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ షోకాజ్ నోటీస్ లో కీలకమైన ప్రశ్నలను సంధించారు.
ప్రభుత్వంతో జీతాలు సమస్య సహా ఆర్ధిక పరమైన అనేక అంశాల మీద మాట్లాడేందుకు సంప్రదించేందుకు అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు గవర్నర్ ని కలవాల్సి వచ్చింది అని బిగ్ క్వశ్చన్ రైజ్ చేశారు. అలాగే గవర్నర్ ని కలసి ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం అంటే అది రోసా నిబంధలనకు విరుద్ధం అని తెలియదా అని కూడా పేర్కొంది.
ఇలా రోసా నిబంధలనకు వ్యతిరేకంగా వెళ్ళిన మీ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని కూడా పేర్కొంది. దీనికి సంజాయిషీని వారం రోజులలోగా ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు తమకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చట్టం ఒకటి తీసుకుని రావాలని కోరుతూ గవర్నర్ ని కలిశారు.
తమకు జీతాలు ప్రతీ నెలా టైం కి చెల్లించడంలేదని ఆర్ధిక అంశాలు అనేకం పెండింగులో పడ్డాయని కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం అనేక సార్లు మాట ఇచ్చి తప్పుతోనని కూడా చెప్పడం విశేషం.  యూనియన్  ప్రెసిడెంట్ సూర్యనారాయణ ఆద్వర్యంలో ఉగ్యోగ సంఘాల ప్రతినిధులు ఈ విధంగా ఫిర్యాదు చేశారు.
ఇలా ఫిర్యాదుని ఒక ప్రభుత్వం మీద గవర్నర్ కి చేయడం అన్నది దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దాంతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కి పడడమే కాకుండా ఇపుడు సదరు యూనియన్ గుర్తింపు ని రద్దు చేసే దిశగా ఆలోచిస్తున్నరు అని అంటున్నారు. అందులో  భాగంగా షోకాజ్ నోటీస్ అని అంటున్నారు.        

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్