
✦ఆదివారం అర్ధరాత్రి కదిరి రైల్వేస్టేషన్ వద్ద ఘటన.
✦కానిస్టేబుల్,హోంగార్డ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.
జనసముద్రం న్యూస్:జనవరి,23.
శ్రీ సత్యసాయి జిల్లా:
జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:
శ్రీ సత్యసాయి జిల్లా/కదిరి న్యూస్: రక్షించాల్సిన కొందరు పోలీస్ లే బక్షకులుగా మారుతున్నారు.పోలీస్ వృత్తికి కలంకం తెస్తున్నారు.ఆడవాళ్లను రక్షించాల్సిన పోలీస్ లే అర్ధరాత్రి కామాంధులుగా మారి యువతిపై అత్యాచార దాడియత్నానికి పాల్పడ్డారు.ఈ సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా,కదిరి నియోజకవర్గం,కదిరిలో చోటుచేసుకుంది ఆదివారం పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన తర్వాత ఓ యువతి ఇంటికి వెళ్ళేందుకు కదిరి రైల్వేస్టేషన్ కు చేరుకుంది.అయితే ఆ యువతి పై కానిస్టేబుల్,హోంగార్డ్ అత్యాచార దాడియత్నానికి ప్రయత్నించారు.బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీస్ లు కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.





