ఫిబ్రవరి 5 లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు : ఏపి జేఏసీ,అమరావతి ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

Spread the love
జనసముద్రం న్యూస్, జనవరి 23

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. ప్రతి నెలా తమకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తుండటం తమ డీఏ బకాయిలను చెల్లించకపోవడం జీపీఎఫ్ బకాయిల పరిస్థితి ఇలాగే ఉండటం వీటిపై ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ప్రతినెలా 20వ తేదీ వస్తే కానీ పూర్తి స్థాయిలో ఉద్యోగులకు జీతాలు పడటం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తాజాగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో భాగంగా అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని..  తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదన్న దాంట్లో నిజం లేదని తెలిపారు. ఉద్యమం వస్తే అందరం కలిసి పోరాడతామని వెల్లడించారు.
తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తమ డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుంటోందన్నారు. గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఒకటో తేదీకల్లా జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం తమకు రావాల్సినవి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు వాపోయారు.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి కొత్త జీవోల ఊసే లేకుండా పోయిందని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎవరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వట్లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు సైతం ఇప్పటికీ అలవెన్సులేమీ ఇవ్వలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులను ఎందుకు క్రమబద్ధీకరించలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు నిలదీశారు. దీనిపై ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకూ లేదన్నారు. కరోనా బారినపడి వందల మంది చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదని హాట్ కామెంట్స్ చేశారు. పదవీ విరమణ చేసినవారికి ప్రయోజనాలు అందించడం లేదని ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్