విలేఖరులకు ఇన్కమ్ టాక్స్ కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.15 రోజుల్లోగా కట్టకపోటే చర్యలు తప్పవని వార్నింగ్

Spread the love

జనసముద్రం న్యూస్ ,జనవరి 22.

ఏపీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న రిపోర్టర్లకు  వృత్తిపన్ను కట్టాలంటూ అధికారుల నుంచి నోటీసులు అందడం ఇప్పుడు వివాదంగా మారింది. పాత బకాయిలు సహా రూ.12500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో ఉంది.

వృత్తిపన్ను చెల్లించాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వివిధ పత్రికలు టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న 28 మంది విలేకర్లకు జనవరి 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు సంవత్సరానికి  రూ.2500 చొప్పున మొత్తం రూ.12500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
దీంతో నోటీసులు అందుకున్న విలేకర్లు వాణిజ్యపన్నుల అధికారి సుబ్బారావును కలిశారు. నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రిపోర్టర్ల నుంచి వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకే నోటీసులు జారీ చేశామని సమాధానం చెప్పారు.
కాగా గతంలో రాజంపేటలోనూ ఇదే విధంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్లు ఆందోళనలు చేయడంతో నోటీసులు వెనక్కి తీసుకుంది. మళ్లీ కోనసీమలో ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలోని వివిధ పత్రికలు ఛానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్తగా అక్రిడేషన్లు ఇవ్వడం.. ఇళ్ల స్థలాలు ఇవ్వడం వంటివేమీ చేయలేదని.. అసలు జర్నలిస్టుల సంక్షేమమే ఈ ప్రభుత్వానికి పట్టడంలేదని.. జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని .. ఇప్పుడు ఈ దోపిడీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం పట్టణాలు మేజర్ పంచాయతీలలో చెత్త పన్ను వంటివి విధించి ఇప్పటికే వ్యతిరేకత మూటకట్టుకోగా ఇప్పుడు జర్నలిస్టులపై పన్ను వేసి వ్యతిరేకంగా పెంచుకుంటోంది.
అక్రిడేషన్లు లేవు.. ఉన్నా దానివల్ల ప్రయోజనాలు లేవు.. ఇప్పుడు అదనంగా టాక్స్ కూడా కట్టాలా అని ఏపీ జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్