అరాచకం దుర్మార్గం దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నిప్పులు చెరిగిన నాగబాబు

Spread the love

జనసముద్రం న్యూస్ ,జనవరి 21.

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మరోమారు అధికారంలోకి రావాలని.. 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభలో అడుగుపెడతానంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ–జనసేన కలసి పోటీ చేస్తాయనే చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల విజయవాడలో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు హైదరాబాద్ లో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడంతో పొత్తులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా జనసేన ముఖ్య నేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జనసేన వీర మహిళలు కార్యకర్తల సమావేశానికి హాజరైన నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక పార్టీయేనా.. అరాచకం దుర్మార్గం దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నిప్పులు చెరిగారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు తెలిపారు. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో తెలుస్తుందని వివరించారు. వీరమహిళలు జన సైనికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి కర్నూలు వచ్చానని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా వున్నారన్న నాగబాబు.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను నియమించాలని సూచించారు.
తద్వారా పవన్ పొత్తులపై స్పష్టంగానే ఉన్నారని త్వరలో ఈ మేరకు ప్రకటన కూడా చేయబోతున్నట్లు నాగబాబు మాటల ద్వారా స్పష్టమవుతుందని అంటున్నారు. ఆ తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేదాని పైన క్లారిటీ వస్తుందంటున్నారు.
మరోవైపు టీడీపీ– జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తే మరి బీజేపీ సంగతి ఏంటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ప్రస్తుతం జనసేన–బీజేపీల మధ్య పొత్తు ఉంది. బీజేపీ తమ కూటమిలో చేరితే సరి లేకుంటే జనసేన–టీడీపీ కలిసి సాగాలనేది పవన్ కల్యాణ్ అభిప్రాయమని టాక్ నడుస్తోంది.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్