గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నజిల్లెల రవి యాదవ్

Spread the love

మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం వినాయక్ నగర్ డివిజన్ సైనికపురి క్రాస్ రోడ్డు దగ్గర సాయి బాబా మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ గారు పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26

ఈ సందర్భంగా జిల్లెల రవి యాదవ్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యమే మహాబలంగా వెలగడం ఈ భరతావని యొక్క గొప్పతనం అన్నారు. ఈ భారత దేశంలో విభిన్న కులాలు మతాలు ఉన్నా కూడా మేమంతా భారతీయులం అన్న గొప్ప నినాదంతో ఐకమత్యంగా మెలుగుతారని, ఆ ఐకమత్యంతోనే స్వతంత్రాన్ని సంపాదించుకున్నామని, స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని అమలుపరచుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. హిందూ ముస్లిం క్రైస్తవ సోదర భావంతో ఈ భారతావనిలో మెలుగుతున్నామని అది మనందరికి గర్వకారణమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సాయి బాబా మినీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు గవ్వల యాదగిరి, బుగ్గ మల్లేష్, చీర ఆంజనేయులు, ఉపేందర్, ధనుజాయ్, వడ్డే కృష్ణ, ఐటీకపల్లి సిద్ధులు, చికడి వెంకటేష్, ఒగ్గు సత్తయ్య, మల్లేష్, కెమిటి రవి, శ్రీను కనకాల వెంకటేష్, కర్రె సీదులు, శ్రీనివాస్ మరియు బిజెపి సర్వేశ్ యాదవ్, ఆర్.మణి రత్నం, భారత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి