డాక్టర్ అంబేద్కర్ అందరివాడు….

Spread the love
  • ఆయన ఫలితంగానే గణతంత్ర వేడుకలు….
  • మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు….
  • మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి… మెదక్ జిల్లా, ప్రతినిధి (జనసముద్రం న్యూస్ )జనవరి:26 మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, ఆదేశానుసారం 74 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా అదనపు ఎస్పీ .బాలస్వామి ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ ఉద్యోగం రావడం అదృష్టంగా భావించి సక్రమంగా విధులు నిర్వహించి, ప్రజల ఆదరాభిమానాలు పొందాలని సూచించారు. ప్రజల్లో పోలీస్ అధికారులు సిబ్బంది మమేకమై విధులు నిర్వహించినప్పుడే, ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతుందని తెలిపారు. మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశా నిర్దేశం చేశారు, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు విధులు నిర్వహిస్తున్నారని. ఎందరో త్యాగధనుల ఫలితం గణతంత్ర దినోత్సవం అని వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి, వారి త్యాగఫలం ద్వారా మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపినారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత ఉంటుందని తెలిపినారు. పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమించి ప్రజల ధన, మాన ప్రాణాలను కాపాడటం లో తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు ఉగ్రవాదులు, తీవ్రవాదులు మరియు ఇతర సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేసినారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు పొందినదని అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మరియు జిల్లా అదనపు ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.యెస్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి ,మెదక్ డీఎస్పీ సైదులు , ఏ.ఆర్ డి.ఎస్.పి. శ్రీనివాస్b , ఆర్.ఐ అచ్యుత రావ్ , ఎస్.బి.సి.ఐ .నవీన్ బాబు , డి.సి.ఆర్.బి. సి.ఐ. దిలీప్ కుమార్ , సి.ఐ .శ్రీధర్ , సి.సి.ఎస్. సి.ఐ. గోపినాథ్, ఐ.టి. కోరే ఎస్.ఐ. రాజు గౌడ్ మరియు డి.పి.ఓ సిబ్బంది పాల్గొన్నారు.
  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి