
- ప్రభుత్వం చేపట్టిన 19 నుంచి కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రజలు సద్విని చేసుకోవాలి….
- మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్….
మెదక్ జిల్లా, ప్రతినిధి (జనసముద్రం న్యూస్) జనవరి :26
74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో జరిగిన వేడుకలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 19 నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవలసిందిగా సూచించారు. జిల్లాలో గత ఖరీఫ్ లో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 91,379 మంది రైతుల నుండి 3,93,578 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 810 కోట్ల 77 లక్షలు రైతుల ఖాతాలో వేశామని అన్నారు. ఈ యాసంగిలో 2,43,937 ఎకరాలలో వివిధ పంటలు సాగు అంచనా వేయడం జరిగిందని, పెట్టుబడి సాయంగా రైతు బందు పథకం క్రింద 2,34,690 మంది రైతులకు 173 కోట్ల 31 లక్షలు అందించామని, అలాగే ప్రధాన మంత్రి కిసాన్ పధకం క్రింద 12వ విడతలో 1,37,151 మందికి 27 కోట్ల 43 లక్షలు అందించామన్నారు. రైతు భీమా క్రింద ఇప్పటి వరకు చనిపోయిన 323 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున 16 కోట్ల 15 లక్షలు భీమా సొమ్ము చెల్లించామన్నారు. జిల్లాలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 గోదాములు మాత్రమే ఉండగా అదనంగా 46 కోట్ల 50 లక్షల వ్యయంతో 77,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో 21 గోదాములు నిర్మిస్తున్నామని తెలిపారు. గొర్రెల అభివృధి పధకంలో భాగంగా రెండవ విడతలో 7,184 లబ్దిదారులకు యూనిట్లు పంపిణి చేయుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాడి పశువుల పధకం క్రింద 5 కోట్ల 44 లక్షల సబ్సిడీతో 1,193 పాడి పశువులను లబ్దిదారులకు అందించామని, అలాగే దళితబంధు పధకం క్రింద 59 మంది లబ్దిదారులకు పాడి పశువులు, గొర్రెలు ,మేకల యూనిట్లు , రైతులకు 3 పౌల్ట్రీ యూనిట్లు అందించామన్నారు. దళితబంధు పధకం క్రింద మినీ డైరీ ఫారం, పౌల్ట్రీ ఫారం, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, మినీ సూపర్ మార్కెట్ వంటి స్వయం ఉపాధి పథకాలకు గాను 256 మంది లబ్దిదారులకు 25 కోట్ల 34 లక్షలు అందించామన్నారు. మత్స్య కారుల ఆర్థికాభ్యున్నతికి 1,617 చెరువులలో 5 కోట్ల చేప విత్తనాలను వదిలామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా 68,057 భూ లావాదేవీలు నిర్వహిచడంతో పాటు 12,236 గిఫ్ట్ డీడ్ లు 11,745 విరాసత్ లు , 7,249 లావాదేవీలు నిర్వహించామన్నారు హరిత హారం కార్యక్రమంలో భాగంగా 2022 సంవత్సరంలో 39 లక్షల 78 వేల మొక్కలు నాటామన్నారు.

43 కోట్ల 64 లక్షల వ్యయంతో చేపట్టిన వన దుర్గా ప్రాజెక్ట్ ఆనకట్ట ఎత్తు పనులు పురోగతిలో ఉన్నాయని, 60 శాతం పనులు పూర్తయ్యాయని తద్వారా వేలాది ఎకరాలకు సాగునీరందుతుందని అన్నారు. అలాగే కొండపోచమ్మ సాగర్ ద్వారా కాళేశ్వరం జలాలలను 18,452 ఎకరాలకు అందించుటకు 185 కోట్ల 75 లక్షల వ్యయంతో శంకరంపేట కాలువ నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చుటకు మిషన్ భగీరథ క్రింద 109 గ్రామాల్లో గోదావరి జలాలను, 408 గ్రామాలలో మంజీరా,429 గ్రామాలలో సింగూరు జలాలను అందిస్తున్నామని అన్నారు. ఆసరా పధకం క్రింద జిల్లాలో 1,18,560 అంది వృద్దులు,వితంతువులు,వికలాంగులు, గీతా, చేనేత ,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు,ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 25 కోట్ల 63 లక్షల పింఛనలు ఇస్తున్నామన్నారు. పింఛను వయస్సును 57 సంవత్సరాలకు తగ్గించడం వల్ల జిల్లాలో కొత్తగా 12,141 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ క్రింద 3,440 మంది లబ్దిదారులకు 34 కోట్ల 33 లక్షలు అందించామన్నారు.
ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 6,693 స్వయం సహాయక సంఘాలకు 413 కోట్ల 32 లక్షల రూపాయల బ్యాంకు లింకేజి అందించామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద 37 లక్షల 45 వేల పని దినాలు కల్పించి 63 కోట్ల 40 లక్షల రూపాయల కూలి డబ్బులు చెల్లించామని ప్రతిమ సింగ్ తెలిపారు. టి.ఎస్. ఐ పాస్ క్రింద జిల్లాలో ఇప్పటి వరకు 8,093 కోట్ల పెట్టుబడితో 759 పరిశ్రమలు స్థాపించి 25,354 మందికి ఉపాధి కల్పించామని, అదేవిధంగా ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జెనెరేషన్ ప్రోగ్రాం క్రింది 86 కోట్ల 22 లక్షల తో 29 యూనిట్లు మంజారు చేశామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద మొదటి దశలో ఎంపిక చేసిన 313 పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, అదనపు గదుల నిర్మాణం, కిచెన్ షెడ్లు తదితర వాటి నిర్మాణానికి 65 కోట్ల అంచనా రూపొందించగా ఇప్పటి వరకు 258 పాఠశాలలో పనులు జరుగుచున్నాయని అన్నారు. పదవ తరగతి ఉతీర్ణతలో జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి 225 పాఠశాలలో చదువుచున్న10,695 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా 11 అంగన్వాడీ కేంద్రాలను మోడల్ అంగన్వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లాలో 5 కోట్ల 50 లక్షలతో ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేశామని, అలాగే 270 తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు మునిసిపాలిటీలలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బి శాఖల ద్వారా రహదారుల నిర్మాణాలు జరుగుచున్నాయన్నారు.

శాంతిభదత్రతలను కాపాడాటంలో, నేరాలు అరికట్టడంలో, రహాదారుల ప్రమాదాలు నివారణలో అహర్నిశలు కృషిచేస్తున్న పొలిసు యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ, జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుటలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలసినదిగా విజ్ఞప్తి చేశారు
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
అనంతరం ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి సన్మానించారు. కులాంతర వివాహాలు చేసుకున్న 4 జంటలకు రెండున్నర లక్షల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందజేశారు. మెప్మా క్రింద స్వయం సహాయక సంఘాలకు 11 కోట్ల 92 లక్షల నిధుల చెక్కును అందజేశారు. జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్న 4 క్రీడాకారులతో పాటు నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులు మెమెంటోలు అందజేశారు ఆ తరువాత ఎస్సి అభివృద్ధి శాఖ, మెప్మా, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బాలస్వామి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.





