రెండో రోజుకు చేరిన ప్రీమియరీ ఎక్స్ ఫ్లో జివ్స్ వర్కర్ల(కార్మికులు) నిరవధిక సమ్మె.

Spread the love

-పనిచేసే కార్యాలయం ముందు నిరసనలు

  • కార్మికులకు మద్దతు ప్రకటించిన సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు

సింగరేణి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ కు, వినతి పత్రం అందజేత.

జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి.

మణుగూరు ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో ఎక్స్ ప్లో జివ్ కార్మికులు.చేస్తున్ననిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది.రెండో రోజు కార్మికులుకార్యాలయం ముందు సమ్మె కొనసాగిస్తుండగా వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు అండగా నిలిచారు.
రెండవ రోజు సమ్మెకు సిపిఐ పార్టీ మణుగూరు మండల కార్యదర్శి జంగమోహన్రావు , ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ ఎఐటియుసి మండల కార్యదర్శి అక్కి నరసింహారావులు హాజరై మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ , సిపిఐ మణుగూరు మండల కార్యదర్శి జంగం మోహన్ రావు లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయకుండా మేనేజ్ మెంట్ కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని , కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులను యాజమాన్యం కాలరాస్తూ వారిని వెట్టి చాకిరి చేపిస్తుందని, నేడు కనీస అవసరాలు అత్యవసర వరకు సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుంటే చాలీచాలని వేతనాలతో కాలం వెళ్ళదీస్తున్నా రని, ఎక్కడ చూసినా పేదవాడు కార్మికుల పొట్ట కొట్టడమే యాజమాన్యాల తీరుగా మారిందని దీనిని కమ్యూనిస్టు పార్టీ మరియు ఏఐటియు సి చూస్తూ ఊరుకోదని వారు హెచ్చరించారు. ఏఐ టీయు సీ నాయకత్వాన అనేకసార్లు మేనేజ్ మెంట్ వారు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని, వారి కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని వారు ఆరోపించారు. యాజమాన్యం కార్మికులతో 30 సంవత్సరాల నుండి వెట్టి చాకిరి చేపిస్తుందని, సమస్యల గురించి మాట్లాడితే పట్టించుకోవడంలేదని అందుకే కార్మికులు విసుకు చెంది సమ్మెకు దిగాల్సి వచ్చిందని, ఇకనైనా యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐటియు సి , చేస్తున్న ఆందోళన కు మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తా మ ని వారు హెచ్చరించారు.

మణుగూరు సింగరేణి ఏజీఎం లలిత్ కుమార్ గారి కి ప్రీమియర్ ఎక్స్ ప్లో జివ్ కార్మికుల సమస్యల వివరించి, పరిష్కరించాలని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఐ టియు సి నాయకులు అందజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటియుసి మండలఅధ్యక్షలు తోట రమేష్, కార్యదర్శి అక్కి నరసింహారావు , వార్డు మెంబర్లు వజ్రా వెంకటేశ్వర్లు కనితి సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు ఎస్.కె సర్వర్ , సొందే కుటుంబరావు, మంగి వీరయ్య, కార్మికులు ఎర్రయ్య, యాకయ్య ,బుచ్చి రాములు, అశోకు ,బాబురావు, నరసింహారావు ,మాధవరావు బాబురావు ,కార్మికులు, పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి