గచ్చిబౌలి లో తీవ్ర ఉద్రిక్తత

Spread the love

కూల్చివేతలనుఅడ్డుకోవడానికి ప్రయత్నించిన రవి కుమార్ యాదవ్, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్

పోలీసుల నిర్బంధంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

జనసముద్రం న్యూస్, గచ్చిబౌలి (జనవరి 24)

శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని గచ్చిబౌలి డివిజన్ జిపిఆర్ ఎ క్వాటర్స్ లో తెల్లవారి జీవమునుండే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, పొట్ట కోటి కోసం నగరానికి వచ్చి రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేద ప్రజలపై జిహెచ్ఎంసి అధికారులు తమ జులుం ప్రదర్శించారు గుడిసెలు తొలగిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బాజాపా నాయకులు రవికుమార్ యాదవ్ సంఘటన స్థలానికి వెళ్లి కూల్చివేతను అడ్డుకోగా వారిని అరెస్టు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని కాలం వెళ్లబోస్తున్న కటిక పేదలపై కక్షపూరితంగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా గుడిసెలను ఇష్టారాజ్యంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తూ , ఈ పేదవారికి ఆ గుడిసెలపై కరెంటు బిల్లు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అన్ని హక్కులను కల్పించి ఇప్పుడు మధ్యంతరంగా గుడిసెలను తొలగించి రోడ్డుపాలు చేయడం సబబు కాదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీరికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని లేదా ప్రత్యామ్నాయ స్థలం చూయించాలని డిమాండ్ చేశారు.


స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి పేదవారి ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు తమ ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అండదండలతో మొన్న బసవతారక నగర్ ,మసీదు బండ వడ్డెర బస్తి ,స్టాలిన్ నగర్ ఇలా అనేక ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజల గుడిసెలను తొలగించి వారిని రోడ్డున పడవేశారని తెలియజేస్తూ ప్రతి పేదవాడికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేశారు
పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకుల పరామర్శ
నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్న నాయకులను పరామర్శించడానికి శేరిలింగంపల్లి కన్వీనర్ రాఘవేంద్రరావు , గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ,చందానగర్ మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి , మరియు నాయకులు హనుమంత్ నాయక్, గణేష్ ముదిరాజ్ ,తిరుపతి ,వరలక్ష్మి ,ఇందిరా, శివ సింగ్, భరత్, లడ్డు యాదవ్, రంగస్వామి, కరణ్ గౌడ్, క్రాంతి, తదితరులు కలిసి వెళ్లారు

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి